సాక్షి, నాగపూర్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పీడ్ పెంచారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ప్లాన్స్ చేస్తూ దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో గురువారం నాగపూర్‌లో బీఆర్‌ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు సీఎం కేసీఆర్. ఈ సందర్బంగా బీఆర్‌ఎస్ పార్టీ ఆఫీసులో కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. ఇక, గత నెల 22న మహారాష్ట్రలో బీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించింది.
కాగా, బీఆర్‌ఎస్ ఆఫీసు ప్రారంభోతవ్సం అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. మరో 6 నెలల్లో మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడమే పార్టీల లక్ష్యమైపోయింది. కర్ణాటకలో ప్రభుత్వం మారినా ఏమైనా మార్పు జరిగిందా?. పరివర్తన లేనప్పుడు ఎవరు గెలిస్తే ఏంటి?. మహారాష్ట్రలో ఎన్నో నదులున్నా వ్యవసాయానికి నీళ్లు లేవు. లక్ష్యం లేని సమాజం, దేశం ఏ దిశగా పయనిస్తాయి. 75ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా ప్రజలకు కూడు, గూడు కరువే అయ్యింది. ఈ దేశంలో ఏం జరుగుతోంది?.. అసలు భారత్ లక్ష్యమేంటి?.
ఆదివాసీలు తమ హక్కుల కోసం ఇంకెన్నాళ్లు పోరాడాలి. దేశ రాజకీయాల్లో మార్పు కోసమే బీఆర్‌ఎస్ ఏర్పాటు. ఆలోచన విధానం మారనంత వరకు దేశంలో మార్పు రాదు. దేశంలో ప్రతీ ఇంటికీ తాగునీరు అందించే వనరులున్నాయి. ఇన్ని వనరులు ఉన్నా దేశంలో ఇంకా విద్యుత్ సంక్షోభం ఎందుకు అని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఇంట్లో ఐటీ సోదాలు.. రంగంలోకి ఈడీ
Comments
Please login to add a commentAdd a comment