న్యూఢిల్లీ: వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు విదేశాల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తోంది. చిలీ, కెనడా, మలేషియా తదితర దేశాలు ‘వందే భారత్’ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ రైలు నిర్మాణానికి అయ్యే ఖర్చు తక్కువ కావడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
ఇతర దేశాలలో ఆధునిక సౌకర్యాలు కలిగిన రైళ్ల నిర్మాణానికి రూ. 160-180 కోట్ల మధ్య ఖర్చు అవుతుంది. భారతదేశంలో నిర్మితమయ్యే వందే భారత్ రైలు వ్యయం రూ.120 నుండి రూ. 130 కోట్ల మధ్య ఉంటుంది. వందే భారత్ గంటకు 0 నుండి 100 కి.మీ. వేగాన్ని చేరుకోవడానికి కేవలం 52 సెకన్లు పడుతుంది. ఇది జపాన్ బుల్లెట్ రైలు కంటే అధికం. జపాన్ బుల్లెట్ రైలు గంటకు 0-100 కి.మీ వేగాన్ని అందుకోవడానికి 54 సెకన్లు పడుతుంది. వందేభారత్‌ను మరింత మెరుగ్గా రూపొందించారని విదేశీ ప్రతినిధులు చెబుతున్నారు.
కాగా భారతీయ రైల్వేల అభివృద్ధి గురించి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ గడచిన 10 ఏళ్లలో 31,000 కిలోమీటర్లకు పైగా ట్రాక్‌లను జోడించామని తెలిపారు. దీన్ని 40,000 కిలోమీటర్ల వరకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 10,000 లోకోలు, 9,600 కిలోమీటర్ల ట్రాక్‌కు టెండర్లు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు.
ఇది కూడా చదవండి: ఉగ్రదాడుల ముప్పు?.. ముంబై హైఅలర్ట్
Comments
Please login to add a commentAdd a comment