సికింద్రాబాద్‌–వైజాగ్‌ మధ్య మరో వందేభారత్‌!? | Another Vande Bharat between Secunderabad to Vizag | Sakshi
Sakshi News home page

సికింద్రాబాద్‌–వైజాగ్‌ మధ్య మరో వందేభారత్‌!?

Published Wed, Sep 27 2023 2:40 AM | Last Updated on Thu, Sep 28 2023 4:19 PM

Another Vande Bharat between Secunderabad to Vizag - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రెండో వందేభారత్‌ రైలు  సాధించేందుకు సికింద్రాబాద్‌–విశాఖపట్నం మార్గం పోటీ పడుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలను వందేభారత్‌తో జోడించేందుకు కేంద్రప్రభుత్వం వేగంగా వందేభారత్‌ రైళ్లను కేటాయి­స్తోంది. ఒక మార్గానికి ఒకే రైలు పద్ధతిలో ఇప్పటి వరకు ఆ కేటాయింపులున్నాయి. అయితే తొలి­సారిగా కేరళలోని తిరువనంతపురం–కాసర్‌గాడ్‌ మధ్య తాజాగా రెండో వందేభారత్‌ రైలును ప్రారంభించి ఆ పద్ధతిని బ్రేక్‌ చేసింది.

ప్రస్తుతం దేశవ్యా­ప్తంగా నడుస్తున్న వందేభారత్‌ రైళ్లలో ఇది అత్యధిక ఆక్యుపెన్సీ (సగటున 177 శాతం) రేషియోతో కిక్కి రిసి నడుస్తూ, రైల్వేకు మంచి లాభాలు తెచ్చిపెడు తోంది. ఈ క్రమంలో అత్యధిక ఆక్యుపెన్సీ రేషియో ఉన్న మార్గాల జాబితాలో సికింద్రాబాద్‌– విశాఖప ట్నం ముందు వరుసలో ఉండటంతో ఈ మార్గాన్ని కూడా రైల్వే శాఖ పరిశీలిస్తున్నట్టు సమాచారం.

అత్యధిక ఆక్యుపెన్సీ రేషియోతో: ఇటీవల దేశ వ్యాప్తంగా తొమ్మిది వందేభారత్‌ రైళ్లను ప్రారంభించినప్పుడు కాసర్‌గాడ్‌–తిరువనంతపురం మధ్య రెండో వందేభారత్‌ రైలును పట్టాలెక్కించింది. తొలి వందేభారత్‌ తిరువనంతపురం, కొల్లాం జం­క్షన్, కొట్టా యం, ఎర్నాకులం,  త్రిసూర్, కోజి­కో­డ్, కన్నూరు, కాసర్‌గాడ్‌ మార్గంలో తిరుగుతుండ­గా, రెండో వందే భారత్‌ కాసర్‌గాడ్, కన్నూరు, కో­జికోడ్, తిరూర్, షా రనూర్‌ జంక్షన్, త్రిసూర్, ఎ­ర్నా­కు­లం జంక్షన్, అల్లె ప్సీ, కొల్లామ్‌ జంక్షన్, తిరు­వనంతపురం రూట్‌లో తిరుగుతోంది. ఇక సంక్రాంతి రోజున ప్రారంభమైన సికింద్రాబాద్‌–­విశాఖ­పట్నం వందేభారత్‌ రైలు 120–130 శాతం ఓఆర్‌తో తిరుగుతోంది.

రెండోది గుంటూరు మీదుగా?
దేశంలో ప్రస్తుతం పరుగుపెడుతున్న వందే­భారత్‌ రైళ్లలో ముంబై–గాంధీనగర్, ఢిల్లీ–వా­రణాసి, సికింద్రాబాద్‌–విశాఖపట్నం రైళ్లు గరిష్ట ఓఆర్‌తో తిరుగుతున్నాయి. వీటిల్లో విశాఖ రైలు ఆక్యుపెన్సీ రేషియో ఎక్కువ స్థిరంగా ఉంటోందని అధికారులు చెబుతున్నారు. దీంతో ఈ మార్గంలో మరో మినీ వందేభారత్‌కు అవకాశం ఉందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు రైల్వేబోర్డు దృష్టికి తెచ్చారు. ప్రస్తుతం వరంగల్‌ మీదుగా విశాఖ వందేభారత్‌ రైలు తిరుగుతోంది. గుంటూరు మీదుగా రెండోదాన్ని తిప్పొ­చ్చన్నది అధికారుల మాట. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement