ఇండియన్ రైల్వే దినదినాభివృద్ధి చెందుతోంది. ఇందులో భాగంగానే మరింత వేగవంతమైన ప్రయాణం కోసం గత కొంత కాలంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పుట్టుకొస్తున్నాయి. నేడు చాలామంది దూరప్రయాణాలు చేసేవారు కూడా వందే భారత్‌లో ప్రయాణించడానికి ఆసక్తి చూపుతున్నారు. కాగా కొంతమంది ప్యాసింజర్ల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా రైల్వే శాఖ ఇప్పుడు కొన్ని మార్పులు చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం, వందే భారత్ ట్రైన్లలో లంచ్ లేదా డిన్నర్ ఆర్డర్ చేసే ప్రయాణికులకు మెనూలో లేని పదార్థాలు కూడా విక్రయిస్తున్నారని, ఫుడ్ ఐటమ్ కవర్లన్నీ కొందరు కోచ్‌లోనే పడేయడం వల్ల అపరిశుభ్రత ఏర్పడుతోందని, ఇది ప్రయాణికుల సౌకర్యానికి భంగం కలిగిస్తుందని కొందరు ఫిర్యాదు చేస్తున్నారు.
ప్రయాణికుల ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ బేకరీ ఉత్పత్తులు, స్వీట్స్, కూల్ డ్రింక్స్, లా కార్టే ఐటెమ్స్ వంటి వాటిని ఆరు నెలలు పాటు నిషేదించింది. ఫుడ్ కవర్లు కోచ్‌లో ఉండటం వల్ల.. కొన్ని సార్లు ఆటోమాటిక్ డోర్లు ఓపెన్ అవుతున్నాయి. అంతే కాకుండా వ్యర్దాల వల్ల కోచ్‌లో దుర్వాసన కూడా వ్యాపిస్తోంది. ఈ కారణాల వల్ల రైల్వేశాఖ ఈ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదీ చదవండి: భారత్ మీదే ఆశలన్నీ.. జర్మన్, జపనీస్ కంపెనీల తీరిది!
ఇప్పటి వరకు వందే భారత్ రైళ్లలో ఎలాంటి ఆహార పదార్థాలు విక్రయిస్తున్నారనే విషయం మీద కూడా కొంత గందరగోళం నెలకొంది. అయితే ఇకపై బుక్ చేసేటప్పుడు బుకింగ్ సమయంలోనే ప్రయాణానికి ముందు రీకన్ఫర్మేషన్ క్యాటరింగ్ సర్వీస్ వివరాలు ప్రయాణికులకు మెసేజ్ రూపంలో వస్తాయి. ఇది ప్రయాణికులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment