ప్రీమియం రైళ్లలో ప్రత్యేకత ఇదే | Passengers Get Special Free Food In These Trains, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

ప్రీమియం రైళ్లలో ప్రత్యేకత ఇదే

Published Tue, Nov 5 2024 9:19 AM | Last Updated on Tue, Nov 5 2024 9:51 AM

Passengers get Free Food in These Trains

న్యూఢిల్లీ: భారతీయ రైల్వేలు ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి. అందుకే వీటిని దేశానికి లైఫ్ లైన్ అని అంటారు. భారతీయ రైల్వేలు  పేద తరగతికి అతి తక్కువ ఛార్జీలతో జనసాధారణ్‌ ఎక్స్‌ప్రెస్‌లను నడుపుతుండగా, ధనికుల కోసం వందే భారత్ వంటి ప్రీమియం సెమీ-హై స్పీడ్ రైళ్లను కూడా నడుపుతున్నాయి. వీటిలోని కొన్ని రైళ్లలో ప్రయాణీకులు ఆహారం కోసం ప్రత్యేకంగా నగదు చెల్లించాల్సిన అవసరం ఉండదు.

సాధారణంగా సుదూర రైళ్లలో మాత్రమే ఆన్‌బోర్డ్ క్యాటరింగ్ సౌకర్యం ఉంటుంది. తక్కువ దూరం ప్రయాణించే రైళ్లలో ఆన్‌బోర్డ్ క్యాటరింగ్ సౌకర్యం  అందుబాటులో ఉండదు. అయితే దేశంలోని కొన్ని ఎంపిక చేసిన రైళ్లలో ప్రయాణికులకు ఉచిత ఆహారం అందిస్తారు. దీని కోసం విడిగా ఎటువంటి ఛార్జీలు వసూలు చేయరు.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్, గతిమాన్ ఎక్స్‌ప్రెస్, రాజధాని ఎక్స్‌ప్రెస్, శతాబ్ది ఎక్స్‌ప్రెస్, దురంతో ఎక్స్‌ప్రెస్ తదితర ప్రీమియం రైళ్లలో ప్రయాణికులకు ఉచితంగా ఆహారం అందిస్తారు.  ఈ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల నుంచి వారు టిక్కెట్లు బుక్ చేసుకునే సమయంలో ఆహారం కోసం ఛార్జీలు వసూలు చేస్తారు. అంటే ఈ రైళ్ల టిక్కెట్లలో ఆహారం ఖర్చు కూడా జతచేరి ఉంటుంది. ఇతర రైళ్లలో మాదిరిగా కాకుండా ఈ రైళ్లలో విడిగా ఆహారానికి డబ్బులు చెల్లించి కొనుగోలు చేయవలసిన అవసరం  ఉండదు.

ఇతర సాధారణ మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణికుల  నుంచి టిక్కెట్‌లతో పాటు ఆహారం కోసం ఎటువంటి ఛార్జీ విధించరు. అటువంటి పరిస్థితిలో ఈ సాధారణ మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించేటప్పుడు ఆహారం కోసం విడిగా నగదు చెల్లించాల్సి ఉంటుంది. వందే భారత్, గతిమాన్ ఎక్స్‌ప్రెస్, రాజధాని, శతాబ్ది తదితర ప్రీమియం రైళ్లలో ఆహారం కోసం ప్రత్యేకంగా నగదు చెల్లించాల్సిన అవసరం ఉండదు. 

ఇది కూడా చదవండి: రైలు ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. త్వరలో సూపర్‌ యాప్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement