మనుబోలు(శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా): తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళుతున్న వందే భారత్ రైల్లోంచి హఠాత్తుగా పొగలు రావడంతో ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా మనుబోలు వద్ద రైలును 30 నిమిషాలు ఆపివేసిన ఘటన బుధవారం జరిగింది. సాయంత్రం ఐదు గంటల సమయంలో రైలు మనుబోలు స్టేషన్ సమీపంలోకి వస్తుండగా ఓ బోగిలో నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన అధికారులు రైలును స్టేషన్‌లో నిలిపివేశారు.
ఒక్కసారిగా రైలు ఆగిపోవడంతో ప్రయాణికులు భయబ్రాంతులకు గురై కిందకు దిగేశారు. 3వ భోగీ బాత్‌రూం నుంచి పొగలు వస్తున్నాయని తెలుసుకుని సిబ్బంది వెళ్లి పరిశీలించారు. ఎవరో సిగరెట్ తాగి పడేయడంతో ప్లాస్టిక్ వస్తువులకు అంటుకుని పొగలు వచ్చినట్లు గుర్తించారు. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ఆ పని చేసి ఉంటాడని అనుమానిస్తూ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అరగంట తర్వాత రైలు బయలుదేరింది.
Comments
Please login to add a commentAdd a comment