Wankhede
-
అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ముంబై ఇండియన్స్‌కు ఉన్న అజేయ రికార్డు శుక్రవారం బద్దలైంది. సొంత మైదానం వాంఖడేలో పన్నెండేళ్ల తర్వాత తొలిసారి ముంబై కేకేఆర్ ముందు తలవంచింది. శ్రేయస్ అయ్యర్ సేన చేతిలో 24 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది.అంతేకాదు ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందిస్తూ పరాజయానికి గల కారణాలు విశ్లేషించాడు.ఓటమికి కారణం అదే ‘‘మేము భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయాం. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయాం. టీ20లలో భాగస్వామ్యాలు నిర్మించలేకపోతే భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుంది.మా ఓటమికి కారణం ఒక్కటనీ చెప్పలేను. చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను. మా బౌలర్లు ఈరోజు అద్భుతంగా రాణించారు.నిజానికి తొలి ఇన్నింగ్స్ తర్వాత వికెట్ మరింత మెరుగైంది. తేమ కూడా ఉంది. అనుకున్న ఫలితం రాబట్టేందుకు మా వంతు కృషి చేశాం.సవాళ్లంటే ఇష్టంఏదేమైనా చివరి వరకు పోరాడుతూనే ఉండాలని నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ ఉంటా. కఠిన పరిస్థితులు ఎదురవ్వడం సహజం.సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ముందుకు సాగితేనే మనల్ని మనం మరింత మెరుగుపరచుకోగలుగుతాం’’ అని పేర్కొన్నాడు. కేకేఆర్ చేతిలో ఓటమికి బ్యాటింగ్ వైఫల్యమే కారణమని హార్దిక్ పాండ్యా స్పష్టం చేశాడు.పూర్తిగా విఫలంకాగా ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు(2/44) తీయగలిగాడు. అయితే, బ్యాటర్‌గా దారుణంగా విఫలమయ్యాడు. మూడు బంతులు ఎదుర్కొని కేవలం ఒక్క పరుగు మాత్రమే చేశాడు. ఇక కేకేఆర్ బౌలర్లలో పేసర్ మిచెల్ స్టార్క్ అద్భుత ప్రదర్శన(4/33)తో దుమ్ములేపాడు.ముంబై వర్సెస్ కేకేఆర్ స్కోర్లు👉టాస్: ముంబై.. తొలుత బౌలింగ్👉కేకేఆర్ స్కోరు: 169 (19.5)👉ముంబై స్కోరు: 145 (18.5)👉ఫలితం: ముంబైపై 24 పరుగుల తేడాతో కేకేఆర్ ఘన విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: వెంకటేశ్ అయ్యర్(కేకేఆర్- 52 బంతుల్లో 70 రన్స్)👉ముంబై ఇండియన్స్ టాప్ స్కోరర్: సూర్యకుమార్ యాదవ్(35 బంతుల్లో 56 రన్స్)A memorable win for @KKRiders 🥳They wrap up a solid performance to get past the #MI challenge 💜 💪Scorecard ▶️ https://t.co/iWTqcAsT0O#TATAIPL | #MIvKKR pic.twitter.com/YT6MGSdPkj— IndianPremierLeague (@IPL) May 3, 2024 -
IND Vs NZ: అది వాడిన పిచ్.. అయినా సరే: విలియమ్సన్
ICC WC 2023 1st semis- India beat NZ: వన్డే వరల్డ్‌కప్-2023 తొలి సెమీ ఫైనల్ సందర్భంగా ‘పిచ్ మార్పు’పై చెలరేగిన వివాదంపై న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ స్పందించాడు. అది వాడిన పిచ్ అని పునర్ఘాటించిన కేన్.. తమకు ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశాడు. ఇప్పటికే వినియోగించిన పిచ్ అయినప్పటికీ చాలా బాగుందని కితాబునిచ్చాడు. కాగా తొలి సెమీస్‌లో టీమిండయా- న్యూజిలాండ్ ముంబైలోని వాంఖడే వేదికగా బుధవారం తలపడిన విషయం తెలిసిందే. టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. శుబ్‌మన్ గిల్(80-నాటౌట్), విరాట్ కోహ్లి(117), శ్రేయస్ అయ్యర్(105) అద్భుత ఇన్నింగ్స్‌తో మెరవగా.. నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనలో ఆఖరి వరకు పోరాడిన న్యూజిలాండ్ 327 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 70 పరుగుల భారీ తేడాతో గెలిచిన టీమిండియా ఫైనల్‌కు దూసుకువెళ్లింది. ఇదిలా ఉంటే.. వాంఖడే పిచ్‌ను ఆఖరి నిమిషంలో మార్చి భారత జట్టుకు అనుకూలం చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై స్పందించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి.. ఇలాంటి టోర్నీల్లో పిచ్ మార్పు సర్వసాధారణమని స్పష్టం చేసింది. వాంఖడే క్యూరేటర్ సిఫారసు మేరకు.. ఐసీసీ స్వతంత్ర పిచ్ సలహాదారుతో సంప్రదించిన తర్వాతే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలో కేన్ విలియమ్సన్ సైతం ఈ వివాదం నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘అది ఇది వరకు వాడిన పిచ్. కానీ చాలా బాగుంది. మ్యాచ్ తొలి అర్ధ భాగంలో టీమిండియా చాలా బాగా బ్యాటింగ్ చేసింది. అయినా.. పరిస్థితులకు అనుగుణంగా పిచ్ మార్పులు జరుగుతూనే ఉంటాయి. అందులో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. భారత జట్టు చాలా బాగా ఆడింది. అయినా ఆఖరి వరకు మేము పోరాడి ఓడిపోయాం. అయితే, మేటి జట్టుకు మాత్రం గట్టి పోటీనివ్వగలిగాం. ప్రపంచంలోనే టీమిండియా అత్యుత్తమ జట్టు. ప్రస్తుతం వాళ్లు ఉత్తమ దశలో ఉన్నారు’’ అని విలియమ్సన్ పిచ్ మార్పు వివాదాన్ని కొట్టిపారేశాడు. View this post on Instagram A post shared by ICC (@icc) -
Ajaz Patel: పుట్టిన గడ్డ మీద.. టీమిండియాపై అరుదైన రికార్డు.. సూపర్!
Ind Vs Nz Mumbai Test: Ajaz Patel Record 10 Wickets 1st innings Twitter Reactions: అజాజ్ పటేల్.. భారత మూలాలున్న ఈ న్యూజిలాండ్ క్రికెటర్ జీవితంలో ముంబై టెస్టు చిరస్మరణీయంగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. టీమిండియా వంటి పటిష్ట జట్టును ఆలౌట్ చేసి.. ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. అది కూడా తాను పుట్టిన గడ్డపైనే ఈ ఫీట్ నమోదు చేయడం విశేషం. టీమిండియా- న్యూజిలాండ్ రెండో టెస్టులో భాగంగా రెండో రోజు ఆటలో 47.5 ఓవర్లు వేసిన అజాజ్ పటేల్... 119 పరుగులు(12 మెయిడెన్) ఇచ్చి 10 వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో అతడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. టీమిండియా దిగ్గజం అనిల్ కుంబ్లే.. ఈ రికార్డు సాధించిన ఆటగాళ్ల క్లబ్‌లోకి స్వాగతం అంటూ అభినందించగా... మహ్మద్ కైఫ్ అద్భుతమైన ఇన్నింగ్స్ అంటూ ఆకాశానికెత్తేశాడు. ఈ మేరకు.. ‘‘అజాజ్ పటేల్.. వాటే స్టోరీ! ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు.. అత్యద్భుతం.. నువ్వు పుట్టిన గడ్డపై ఈ రికార్డు నమోదు చేయడం మరింత ప్రత్యేకం. వాంఖడే మొత్తం నిలబడి నిన్ను అభినందించడం చూడముచ్చటేసింది. నువ్వు నీ ఇంట్లోనే(స్వదేశం) ఉన్నావన్న భావన కలిగించారు’’ అని కైఫ్ ట్వీట్ చేశాడు. అదే విధంగా ఆర్పీ సింగ్, పార్థివ్ పటేల్ సహా సిమన్ డౌల్ తదితరులు అజాజ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ఇక అజాజ్ రికార్డు నేపథ్యంలో కివీస్ ఆటగాళ్లంతా చప్పట్లు కొడుతూ.. అతడిని తీసుకువస్తుండగా.. టీమిండియా స్పిన్నర్ అశ్విన్ సహా ఇతర ఆటగాళ్లు అతడిని చూసి సంతోషపడుతున్న క్షణాలకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు పడగొట్టిన ఘనత సాధించిన మూడో బౌలర్ అంటూ అభినందించింది. కాగా అజాజ్ పటేల్ ముంబైలో పుట్టాడు. అతడి కుటుంబం 1996లో న్యూజిలాండ్‌కు వలస వెళ్లింది. చదవండి: IND vs NZ 2nd Test- Mohammed Siraj: వారెవ్వా సిరాజ్.. దెబ్బకు రాస్ టేలర్ దిమ్మతిరిగింది పో! వీడియో వైరల్ How about this message from @anilkumble1074 to @AjazP #INDvNZ https://t.co/OWUaN0Jiaf — BLACKCAPS (@BLACKCAPS) December 4, 2021 That’s the most amazing thing I’ve ever seen!! Ajaz Patel….what a phenomenal performance — Aaron Finch (@AaronFinch5) December 4, 2021 Ajaz Patel, what a story! 10 wickets in an inning is magical. To do that in the city you are born is extra special. Great to see Wankhede giving a standing ovation and making Ajaz feel at home.@AjazP — Mohammad Kaif (@MohammadKaif) December 4, 2021 #AjazPatel bowling -47.5 overs#NZ batting- 28.1 overs Sums up the first innings #INDvzNZ Test😊 — R P Singh रुद्र प्रताप सिंह (@rpsingh) December 4, 2021 -
Ind vs NZ Mumbai 2nd Test: అయ్య బాబోయ్... ఒకేరోజు ఇన్ని రికార్డులా!
Ind vs NZ Mumbai 2nd Test: Lowest Test Totals Wankhede Another Records: ముంబై వేదికగా టీమిండియా- న్యూజిలాండ్ రెండో టెస్టులో పలు రికార్డులు నమోదయ్యాయి. రెండో రోజు ఆటలో భాగంగా కివీస్ బౌలర్, భారత మూలాలున్న అజాజ్ పటేల్ ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు పడగొట్టి అరుదైన ఘనత సాధించాడు. ఇక ఈ వ్యక్తిగత ఫీట్‌తో పాటు నమోదైన ఇతర రికార్డులను పరిశీలిద్దాం. వాంఖడే స్టేడియంలో ఇదే అత్యల్పం రెండో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక టీమిండియా బౌలర్లు విశ్వరూపం ప్రదర్శించడంతో న్యూజిలాండ్ కేవలం 62 పరుగులకే కుప్పకూలింది. కాగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో టెస్టుల్లో నమోదైన అత్యల్ప స్కోరు ఇదే కావడం విశేషం. అంతకు ముందు 2004లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 93 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక అదే ఏడాది ఆసీస్‌తో మ్యాచ్‌లో ఇండియా 104 పరుగులకే ఇన్నింగ్స్ ముగించింది. అదే విధంగా 2006లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా 100 పరుగులు, 1981లో ఇంగ్లండ్ ఇండియాతో మ్యాచ్‌లో 102 పరుగులు చేసింది. న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా- అత్యల్ప టెస్టు స్కోర్లు ►ముంబై-2021- 62 పరుగులు ►హామిల్టన్-2002- 94 పరుగులు ►వెల్లింగ్టన్- 1981- 100 పరుగులు ►అక్లాండ్-1968-101 పరుగులు టీమిండియాపై టెస్టుల్లో ప్రత్యర్థి జట్ల అత్యల్ప స్కోర్లు ►న్యూజిలాండ్-2021- 62 పరుగులు- ముంబై ►దక్షిణాఫ్రికా- 2015- 79 పరుగులు- నాగ్‌పూర్ ►ఇంగ్లండ్- 2021- 81 పరుగులు- అహ్మదాబాద్ ►శ్రీలంక- 1990- 82 పరుగులు- చండీగడ్ భారత్‌లో నమోదైన అత్యల్ప టెస్టు స్కోర్లు ►న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా- 2021- 62 పరుగులు ►ఇండియా వర్సెస్ వెస్టిండీస్- 1987- 75 పరుగులు ►ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా- 2008- 76 పరుగులు ►దక్షిణాఫ్రికా వర్సెస్ ఇండియా- 2015- 79 పరుగులు రెండో టెస్టు: టీమిండియా తొలి ఇన్నింగ్స్: 325 పరుగులు ఆలౌట్ న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 62 పరుగులు ఆలౌట్ -
డ్రగ్స్ కేసులో షారుఖ్ తనయుడు అరెస్టు
ముంబై/థానే: దేశ ఆర్థిక రాజధాని ముంబై తీరం సమీపంలో సముద్రంపై విహరిస్తున్న ఓ పర్యాటక నౌకలో జరుగుతున్న డ్రగ్స్పార్టీని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు భగ్నం చేశారు. ఈ ఘటనలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌తోపాటు మరో ఇద్దరిని ఆదివారం అరెస్టు చేశారు. నిషేధిత మాదక ద్రవ్యాలను కలిగి ఉన్నందుకు గాను నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్డీపీఎస్) చట్టం కింద వారిపై కేసు నమోదు చేశారు. నిందితులు ఆర్యన్ ఖాన్, మున్మున్ ధామేచా, అర్బాజ్ మర్చంట్‌ను ముంబై మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టగా, తదుపరి దర్యాప్తు నిమిత్తం వారిని ఒకరోజు ఎన్సీబీ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఆర్యన్ ఖాన్‌పై ఎన్డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 27, సెక్షన్ 8సీ కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. అతడిని ఎన్సీబీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకొని, విచారిస్తున్నారు. నౌకలో మాదక ద్రవ్యాలతో ఆర్యన్ ఖాన్, మున్మున్ ధామేచా, నూపూర్ సారిక, ఇస్మీత్ సింగ్, మొహక్ జస్వాల్, విక్రాంత్ చోకర్, గోమిత్ చోప్రా, అర్బాజ్ మర్చంట్ పట్టుబడ్డారని, వీరిలో ఇద్దరు యువతులు ఉన్నారని వెల్లడించారు. శనివారం రాత్రి వారిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితుల వద్ద నుంచి 13 గ్రాముల కొకైన్, 21 గ్రాముల చరస్, 22 ఎక్స్టసీ మాత్రలు, 5 గ్రాముల మెఫిడ్రోన్(ఎండీ), 1.33 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దుస్తులు, పర్సుల్లో డ్రగ్స్ ముంబై నుంచి గోవాకు పయనమైన కార్డెలియా క్రూయిజ్ షిప్లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడే ఆధ్వర్యంలో అధికారులు మెరుపు దాడి చేశారు. నౌకలో అనుమానితులను సోదా చేశారు. వారి వద్ద పలు రకాల మాదక ద్రవ్యాలు లభించాయి. వాటిని దుస్తుల లోపల దాచిపెట్టినట్లు గుర్తించారు. యువతులు తమ పర్సుల్లో డ్రగ్స్ దాచుకున్నారు. ఆదివారం ఉదయం ముంబైలోని ఎన్సీబీ కార్యాలయంలో నిందితులను ప్రశ్నించారు. అయితే, డ్రగ్స్ పార్టీతో తమకు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎలాంటి సంబంధం లేదని క్రూయిజ్ కంపెనీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఢిల్లీకి చెందిన ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థకు ప్రైవేట్ కార్యక్రమం కోసం ఈ నౌకను అద్దెకు ఇచ్చామని వాటర్‌వేస్ లీజర్ టూరిజం ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ, అధ్యక్షుడు జుర్గెన్ బైలామ్ తెలియజేశారు. కేవలం కుటుంబాలకు వినోదం కలిగించడమే తమ సంస్థ లక్ష్యమని, తమ నౌకల్లో అనుచితమైన పనులను ప్రోత్సహించబోమని వివరించారు. డ్రగ్స్ కేసులో దర్యాప్తు విషయంలో అధికారులకు పూర్తిగా సహకరిస్తామని పేర్కొన్నారు. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటు న్నట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆర్యన్ ఖాన్ అరెస్టును అధికారులు ప్రకటించడానికంటే కొద్ది సేపటి ముందు షారుఖ్ ఖాన్ తన ఇంటి నుంచి లాయర్ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. తన కుమారుడి అరెస్టుపై ఆయన ఇంకా అధికారికంగా స్పందించలేదు. నిందితులను కఠినంగా శిక్షించాలి: రాందాస్ అథవాలే నిషేధిత మాదక ద్రవ్యాలు ఉపయోగించడం వంటి తప్పుడు పనులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే ఆదివారం డిమాండ్ చేశారు. మహారాష్ట్రలో డ్రగ్స్‌కు స్థానం లేకుండా చేయాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను కోరుతానని అన్నారు. నటుడు సుశాంత్ సింగ్ మరణం తర్వాత బాలీవుడ్లో డ్రగ్స్ దందా బహిర్గతమయ్యిందని గుర్తుచేశారు. సినీ పరిశ్రమలో ఇదొక పెద్ద జాడ్యంగా తయారయ్యిందని చెప్పారు. సమస్య పరిష్కారంపై ప్రభుత్వం తక్షణమే దృష్టి పెట్టాలని కోరారు. ముంద్ర పోర్టు ఘటన నుంచి దృష్టి మరల్చడానికే: కాంగ్రెస్ గుజరాత్‌లోని ముంద్ర పోర్టులో ఇటీవల పట్టుకున్న రూ.వేల కోట్ల విలువైన డ్రగ్స్ వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ముంబైలో డ్రగ్స్ పార్టీ ఉదంతాన్ని తెరపైకి తెచ్చారని కాంగ్రెస్ పార్టీ నేత షమా మహమ్మద్ ఆరోపించారు. ముంద్ర పోర్టు ఘటనపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఆగస్టులో ముంద్ర పోర్టులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) రూ.21,000 కోట్ల విలువైన 2,988 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. షారుక్‌ఖాన్ తనయుడికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని ఎన్సీబీని షమా మహమ్మద్ ప్రశ్నించారు. ముంద్ర పోర్టులో పట్టుబడిన డ్రగ్స్‌పై దర్యాప్తు ఎందుకు ఆగిపోయిందో చెప్పాలన్నారు. ఎవరీ సమీర్ వాంఖెడే పర్యాటక నౌకలో డ్రగ్స్ పార్టీని భగ్నం చేసి, బడా బాబుల బరితెగించిన పిల్లలను అదుపులోకి తీసుకున్న ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడే పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. అతడి గురించి ఇంటర్నెట్లో జనం ఆరా తీస్తున్నారు. 40 ఏళ్ల సమీర్ వాంఖెడే ముంబైలో జన్మించారు. ఆయన తండ్రి పోలీసు ఆఫీసర్. సమీర్ 2017లో మరాఠి నటి క్రాంతీ రెద్‌కర్‌ను పెళ్లి చేసుకున్నారు. 2004లో ఇండియన్ రెవెన్యూ సర్వీసు(ఐఆర్ఎస్)కు ఎంపికయ్యారు. మొదట ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఏఐయూ) డిప్యూటీ కమిషనర్‌గా పనిచేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అదనపు ఎస్పీగా, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ)లో జాయింట్ కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. పన్నులు ఎగవేస్తున్న ధనవంతుల బండారాన్ని బయటపెట్టారు. పన్నుల ఎగవేతపై ఉక్కుపాదం మోపారు. ఎగవేతదారుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేశారు. సమీర్‌కు భయం అంటే ఏమిటో తెలియదని, క్రమశిక్షణ కలిగిన నిజాయతీపరుడైన అధికారి అని ఆయనతో కలిసి పనిచేసినవారు చెబుతుంటారు. బాలీవుడ్ సినిమాలంటే సమీర్‌కు చాలా ఇష్టం. అయినప్పటికీ విధి నిర్వహణలో తన వ్యక్తిగత ఇష్టాయిష్టాలను చోటివ్వరు. 2020 నవంబర్ 22న డ్రగ్స్ ముఠా సమీర్‌తోపాటు మరో ఐదుగురు ఎన్సీబీ అధికారులపై దాడి చేసింది. ఈ ఘటనలో ఆయన గాయపడ్డారు. -
కరువుతో అల్లాడుతున్నాం.. ఐపీఎల్ మ్యాచ్‌లొద్దు!
ముంబై: 'ఒక్క క్రికెట్ మ్యాచ్ సందర్భంగా మైదానం నిర్వహణ కోసం కనీసం ఎంతలేదన్న 80వేల నుంచి లక్ష లీటర్ల నీరు అవసరమవుతుంది. రాష్ట్రం అసలే కరువుతో అల్లాడుతున్నది. గత వంద ఏళ్లలో ఎన్నడూలేని కరువు రాష్ట్రంలో తాండవిస్తున్నది. ఇలాంటి పరిస్థితుల నడుమ రాష్ట్రంలో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించడం సబబు కాదు. కాబట్టి ఈ మ్యాచ్‌లను వేరే రాష్ట్రానికి మార్చండి' అంటూ ముంబై బీజేపీ కార్యదర్శి వివేకానంద గుప్తా బీసీసీఐ ప్రెసిడెంట్ శశాంక్ మనోహర్‌కు లేఖ రాశారు. ఏప్రిల్ 9 నుంచి మే 29 వరకు ముంబై, పుణె, నాగ్‌పూర్ లలో మొత్తం 19 ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ మ్యాచ్‌ల సందర్భంగా మైదానాల నిర్వహణకు ఎంతలేదన్న 70 లక్షల లీటర్ల నీటిని వినియోగించాల్సి ఉంటుంది. గత వంద ఏళ్లలో ఎన్నడూ చూడని కరువుతో మహారాష్ట్ర అల్లాడుతున్న నేపథ్యంలో రాష్ట్రవాసి అయిన శంశాక్ మనోహర్ ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఐపీఎల్ మ్యాచ్‌లను బదలాయించాలని గుప్తా కోరారు. కరువుతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ పరిస్థితులను ఏమాత్రం పట్టించుకోకుండా రాష్ట్రంలో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించడం సరికాదని, కరువు పరిస్థితుల పట్ల బీసీసీఐ గుడ్డిగా వ్యవహరించజాలదని ఆయన తన లేఖలో అన్నారు. -
విదర్భకు వడగళ్ల ఉరి
యవత్మాల్ : ఇటీవల కురిసిన అకాల వర్షాలు, వడగండ్లు విదర్భప్రాంత రైతుల ప్రాణాలను హరిస్తున్నాయి. గత ఐదు రోజుల్లోనే 17 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటే పరిస్థితి ఎంత తీవ్రస్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. గత ఫిబ్రవరి 25 వ తేదీన రాష్ట్రంలో కురిసిన అకాలవర్షాలు, వరదలతో అతలాకుతలమైన విదర్భ ప్రాంతంలో ఇప్పటివరకు 36 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని విదర్భ జన్ ఆందోళన్ సమితి అనే స్వచ్ఛంద సంస్థ తెలిపింది. ఈ సందర్భంగా సమితి అధ్యక్షుడు కిషోర్ తివారి మాట్లాడుతూపంటల నష్టంతో మనస్తాపానికి గురై గత ఐదు రోజుల్లో ఆత్మహత్యలకు పాల్పడిన 17 మంది రైతుల గృహాలను సందర్శించి, కుటుంబాలను పరామర్శించామన్నారు. అకాల వర్షాల ముంపుతో తీవ్రంగా నష్టపోయిన రైతుల పరిస్థితి చాలా ఘోరంగా ఉందన్నారు. పంటనష్టపోయిన ప్రతి ఎకరాకు రూ.4,000 చొప్పున గత వారం మహారాష్ట్ర ప్రభుత్వం ఆర్థికసాయం ప్రకటించినా, వాస్తవ పరిస్థితుల్లో పూర్తి నివేదికలు ఇంకా తయారు కాలేదని ఆయన విమర్శించారు. అధికారులు సార్వత్రిక ఎన్నికల పనుల్లో బిజీగా ఉండటంతో పంటనష్టపోయిన రైతుల వివరాలను పూర్తిగా సేకరించడంలో విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన తర్వాతే రైతులకు ఈ ఆర్థికసాయం అందుతుందని స్థానిక అధికారులు చెబుతున్నారన్నారు. ఇదిలా ఉండగా అకాల వర్షాల కారణంగా 50 శాతానికిపైగా పంట నష్టపోయిన రైతులకే సర్కారు ఆర్థికసాయం అందుతుందని అధికారులు చెబుతున్నారు. వడగండ్ల వానవల్ల రాష్ట్రంలో ఉన్న 28 జిల్లాల్లో 19 లక్షలకుపైగా హెక్టార్లలో పంటనష్టం వాటిల్లిందని, రబీ గోధుమ, జొన్న, చెరకు పంటలు దెబ్బతిన్నాయి. అలాగే మామిడి, నారింజ, ద్రాక్ష, దానిమ్మ చెట్లు నేలకూలాయి.