PC: ICC
Ind Vs Nz Mumbai Test: Ajaz Patel Record 10 Wickets 1st innings Twitter Reactions: అజాజ్ పటేల్.. భారత మూలాలున్న ఈ న్యూజిలాండ్ క్రికెటర్ జీవితంలో ముంబై టెస్టు చిరస్మరణీయంగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. టీమిండియా వంటి పటిష్ట జట్టును ఆలౌట్ చేసి.. ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. అది కూడా తాను పుట్టిన గడ్డపైనే ఈ ఫీట్ నమోదు చేయడం విశేషం. టీమిండియా- న్యూజిలాండ్ రెండో టెస్టులో భాగంగా రెండో రోజు ఆటలో 47.5 ఓవర్లు వేసిన అజాజ్ పటేల్... 119 పరుగులు(12 మెయిడెన్) ఇచ్చి 10 వికెట్లు పడగొట్టాడు.
ఈ నేపథ్యంలో అతడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. టీమిండియా దిగ్గజం అనిల్ కుంబ్లే.. ఈ రికార్డు సాధించిన ఆటగాళ్ల క్లబ్‌లోకి స్వాగతం అంటూ అభినందించగా... మహ్మద్ కైఫ్ అద్భుతమైన ఇన్నింగ్స్ అంటూ ఆకాశానికెత్తేశాడు. ఈ మేరకు.. ‘‘అజాజ్ పటేల్.. వాటే స్టోరీ! ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు.. అత్యద్భుతం.. నువ్వు పుట్టిన గడ్డపై ఈ రికార్డు నమోదు చేయడం మరింత ప్రత్యేకం. వాంఖడే మొత్తం నిలబడి నిన్ను అభినందించడం చూడముచ్చటేసింది. నువ్వు నీ ఇంట్లోనే(స్వదేశం) ఉన్నావన్న భావన కలిగించారు’’ అని కైఫ్ ట్వీట్ చేశాడు.
అదే విధంగా ఆర్పీ సింగ్, పార్థివ్ పటేల్ సహా సిమన్ డౌల్ తదితరులు అజాజ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ఇక అజాజ్ రికార్డు నేపథ్యంలో కివీస్ ఆటగాళ్లంతా చప్పట్లు కొడుతూ.. అతడిని తీసుకువస్తుండగా.. టీమిండియా స్పిన్నర్ అశ్విన్ సహా ఇతర ఆటగాళ్లు అతడిని చూసి సంతోషపడుతున్న క్షణాలకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో షేర్ చేసింది. టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు పడగొట్టిన ఘనత సాధించిన మూడో బౌలర్ అంటూ అభినందించింది. కాగా అజాజ్ పటేల్ ముంబైలో పుట్టాడు. అతడి కుటుంబం 1996లో న్యూజిలాండ్‌కు వలస వెళ్లింది.
How about this message from @anilkumble1074 to @AjazP #INDvNZ https://t.co/OWUaN0Jiaf
— BLACKCAPS (@BLACKCAPS) December 4, 2021
That’s the most amazing thing I’ve ever seen!! Ajaz Patel….what a phenomenal performance
— Aaron Finch (@AaronFinch5) December 4, 2021
Ajaz Patel, what a story! 10 wickets in an inning is magical. To do that in the city you are born is extra special. Great to see Wankhede giving a standing ovation and making Ajaz feel at home.@AjazP
— Mohammad Kaif (@MohammadKaif) December 4, 2021
#AjazPatel bowling -47.5 overs#NZ batting- 28.1 overs
— R P Singh रुद्र प्रताप सिंह (@rpsingh) December 4, 2021
Sums up the first innings #INDvzNZ Test😊
Comments
Please login to add a commentAdd a comment