బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా కష్టాల ఊబిలో కూరుకుపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలిన భారత్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 74 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా గట్టెక్కాలంటే మరో రెండు రోజుల పాటు బ్యాటింగ్ చేసి ఓ మోస్తరు టార్గెట్‌ను న్యూజిలాండ్ ముందుంచాలి. భారత్.. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 282 పరుగులు వెనుకపడి ఉంది. చేతిలో మరో తొమ్మిది వికెట్లు మాత్రమే ఉన్నాయి. రోహిత్ శర్మ (37), విరాట్ కోహ్లి (0) క్రీజ్‌లో ఉన్నారు.
అంతకుముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. రచిన్ రవీంద్ర (134) సెంచరీతో, డెవాన్ కాన్వే (91), టిమ్ సౌథీ (65) అర్ద సెంచరీలతో సత్తా చాటారు. భారత బౌలర్లలో కుల్దీప్, జడేజా తలో మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ రెండు, అశ్విన్, బుమ్రా చెరో వికెట్ దక్కించుకున్నారు.
— ViratKingdom (@kingdom_virat1) October 18, 2024
అనవసరమైన షాట్ ఆడి వికెట్ పారేసుకున్న యశస్వి
తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలి మ్యాచ్‌పై పట్టు కోల్పోయిన భారత్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో అయినా జాగ్రత్తగా ఆడాలని అభిమానులు కోరుకున్నారు. అయితే ఓపెనర్ యశస్వి జైస్వాల్ (35) అనవసరమైన షాట్ ఆడి వికెట్ పారేసుకుని అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. యశస్వి అజాజ్ పటేల్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు క్రీజ్ వదిలి ముందుకు వచ్చి స్టంపౌటయ్యాడు. ప్రస్తుతం భారత్ ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి షాట్ ఆడాల్సిన అవసరం లేదు. అయినా యశస్వి ఓవరాక్షన్ చేసి చేజేతులా వికెట్‌ను సమర్పించుకున్నాడు.
కుప్పకూలిన భారత్
మ్యాట్ హెన్రీ (5/15), విలియమ్ ఓరూర్కీ (4/22), సౌథీ (1/8) ధాటికి టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలింది. భారత్ ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు డకౌట్ అయ్యారు. రిషబ్ పంత్ (20), యశస్వి జైస్వాల్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.
Comments
Please login to add a commentAdd a comment