
టెస్ట్ క్రికెట్ చరిత్ర ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఒకే మ్యాచ్‌లో ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ బౌలర్లు నాలుగు ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇది తొలిసారి. భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడో టెస్ట్‌లో ఇది జరిగింది. టీమిండియా బౌలర్ రవీంద్ర జడేజా, న్యూజిలాండ్ బౌలర్ అజాజ్ పటేల్ రెండు ఇన్నింగ్స్‌ల్లో ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశారు. జడేజా తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయగా.. అజాజ్ పటేల్ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు, రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టాడు.
కాగా, న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టెస్ట్‌లో టీమిండియా 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 235 పరుగులకు ఆలౌటైంది. విల్ యంగ్ (71), డారిల్ మిచెల్ (82) రాణించారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా ఐదు, వాషింగ్టన్ సుందర్ నాలుగు, ఆకాశ్‌దీప్ ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం బరిలోకి దిగిన భారత్.. 263 పరుగులకు ఆలౌటైంది. శుభ్‌మన్ గిల్ (90), రిషబ్ పంత్ (60) అర్ద సెంచరీలతో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో అజాజ్ పటేల్ ఐదు వికెట్లు పడగొట్టాడు.
28 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ 174 పరుగులకు ఆలౌటైంది. రవీంద్ర జడేజా ఐదు వికెట్లు తీయగా.. అశ్విన్ మూడు, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్‌దీప్ తలో వికెట్ పడగొట్టారు. 147 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 121 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. న్యూజిలాండ్ బౌలర్లలో అజాజ్ పటేల్ 6 వికెట్లు పడగొట్టగా.. ఫిలిప్స్ 3 వికెట్లతో తీశాడు. భారత బ్యాటర్లలో రిషబ్ పంత్(64) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment