Ind Vs Nz 1st Test: Trolls On Ajinkya Rahane For Another Failure In Kanpur Test: అజింక్య రహానే ఆట తీరు మారడం లేదు. కాన్పూర్ వేదికగా టీమిండియా- న్యూజిలాండ్ మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా 35 పరుగులకే పెవిలియన్ చేరిన రహానే.. రెండో ఇన్నింగ్స్‌లో మరీ దారుణంగా విఫలమయ్యాడు. 15 బంతులు ఎదుర్కొని కేవలం 4 పరుగులు(బౌండరీ) చేసి నిష్క్రమించాడు. అజాజ్ పటేల్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగి మరోసారి నిరాశపరిచాడు. దీంతో నెటిజన్లు రహానేపై విమర్శల జల్లు కురిపిస్తున్నారు.
‘‘కెప్టెన్ అయి ఉండి ఏమాత్రం బాధ్యత లేకుండా ఆడుతున్నావు. నీకిది తగునా రహానే. వరుసగా విఫలమవుతున్నాడు. ఇకనైనా రహానేను జట్టు నుంచి తప్పించాల్సిన సమయం ఆసన్నమైంది. అతడి స్థానంలో కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలి’’ అని ట్రోల్ చేస్తున్నారు. దేశవాళీ టోర్నీలో ఆడి తిరిగి ఫామ్‌లోకి వస్తే బాగుంటుందని రహానేకు హితవు పలుకుతున్నారు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో రహానే జెమీషన్ బౌలింగ్‌లో నిర్లక్ష్యంగా వికెట్ సమర్పించుకుని ఇదే తరహాలో ట్రోలైన సంగతి తెలిసిందే. ఇక రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి గైర్హాజరీలో రహానే సారథిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
చదవండి: Ind Vs Nz Test- Srikar Bharat: ఆ క్యాచ్ నిజంగా సూపర్.. ఒకవేళ భరత్ పట్టుబట్టకపోయి ఉంటేనా!
I think it’s time we discuss Rahane replacement. #NZvIND
— Tweeter (@tweetersprints) November 28, 2021
Told @AddyDaddy28 last night I trust Ashwin and Umesh more than Rahane in batting. Those 2 shots just show why.. Umesh and Ashwin are better batsman than Rahane right now. He's that awful
— Remember the name (@AngryYoungMan24) November 28, 2021
@ImRo45 Jeet k haaarne waale ko #TeamIndia bolte hai😡😡, high time to replace #Rahane as a player, 51 lead nd u r on a spot of looossing a test that too givin wiket to pacers #ViratKohli #RohitSharma #RahulDravid #IndianCricket #INDvsNZ #INDvsNZTestSeries #BCCI
— vishal bansal (@vishalpbansal) November 28, 2021
Interesting now to see who sits out when Virat comes into the XI in Mumbai #INDvsNZ
— Vikrant Gupta (@vikrantgupta73) November 28, 2021
Comments
Please login to add a commentAdd a comment