ఐపీఎల్‌కు-2023కు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ దూరమైన సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్ 30న కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్.. నెమ్మదిగా కోలుకుంటున్నాడు. అయితే అతడు మరో ఐదు నెలల పాటు ఆటకు దూరంగా ఉండనున్నాడు. పంత్ తిరిగి మళ్లీ ఈ ఏడాది సెప్టెంబర్‌లో మైదానంలో అడుగుపెట్టే అవకాశం ఉంది.
పంత్ స్థానంలో కేరళ వికెట్ కీపర్
ఇక ఈ ఏడాది సీజన్‌కు పంత్ దూరం కావడంతో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ వ్యవహరించనున్నాడు. కాగా పంత్ స్థానాన్ని భర్తీ చేసే పనిలో ప్రస్తుతం ఢిల్లీ టీమ్ మేనేజ్‌మెంట్ పడింది. ప్రస్తుతం ఢిల్లీ జట్టులో ఫిల్ సాల్ట్ మినహా మరో వికెట్ కీపర్ లేడు. కాబట్టి కచ్చితంగా మరో వికెట్ కీపర్‌ను జట్టులోకి తీసుకోవాల్సిందే. ఈ నేపథ్యంలో పంత్ స్థానాన్ని కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ అజారుద్దీన్‌తో భర్తీ చేయాలని ఢిల్లీ టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం.
మహ్మద్ అజారుద్దీన్‌కు దేశవాళీ టీ20 క్రికెట్‌లో అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పటివరకు దేశవాళీ టీ20 క్రికెట్‌లో 39 మ్యాచ్‌లు ఆడిన అజారుద్దీన్ 741 పరుగులు సాధించాడు. అతడు ఇన్నింగ్స్‌లలో 1 సెంచరీతో పాటు రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాడు. అదేవిధంగా అతడి కెరీర్‌లో అత్యధిక స్కోర్ 137(నాటౌట్)గా ఉంది. లోయార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి విధ్వంసం సృష్టించే సత్తా అజారుద్దీన్‌కు ఉంది.
ఇక 28 ఏళ్ల అజారుద్దీన్‌కు ఐపీఎల్-2022లో ఆర్సీబీకు ప్రాతినిథ్యం వహించాడు. అయితే గతేడాది సీజన్‌కు మొత్తం బెంచ్‌కే అజారుద్దీన్ పరమితమయ్యాడు. ఇక ఐపీఎల్-2023కు ముందు ఆర్సీబీ అతడిని విడిచిపెట్టింది. ఈ క్రమంలో ఐపీఎల్-2023 మినీ వేలంలోకి వచ్చిన అతడిని ఏ ప్రాంఛైజీ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. అయితే మరోసారి ఐపీఎల్‌లో భాగమయ్యే అవకాశం అజారుద్దీన్‌కు పంత్ రూపంలో దక్కనున్నట్లు తెలుస్తోంది.
చదవండి: IPL 2023: శ్రేయస్ అయ్యర్ దూరం.. కేకేఆర్ కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్!
Comments
Please login to add a commentAdd a comment