
ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాంఛైజీ బిగ్ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తమ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు నుంచి పంత్‌ను తప్పించాలని ఢిల్లీ క్యాపిటల్స్ భావిస్తున్నట్లు సమాచారం.
అతడి స్ధానంలో స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు తమ జట్టు పగ్గాల అప్పగించాలని సదరు ఫ్రాంచైజీ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అక్షర్ గత కొన్ని సీజన్లగా ఢిల్లీ జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. ప్రతీ సీజన్‌లోనూ అక్షర్ తన మార్క్‌ను చూపిస్తున్నాడు. ఈ ఏడాది సీజన్‌లోనూ అక్షర్ పటేల్ అదరగొట్టాడు.
14 మ్యాచ్‌లు ఆడి 11 వికెట్లతో పాటు 235 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే అతడిని తమ కెప్టెన్‌గా నియమించాలని ఢిల్లీ ఫ్రాంచైజీ ఫిక్స్ అయినట్లు పేర్కొంటున్నాయి. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ పంత్‌ను మాత్రం తమ టాప్ రిటెన్షన్ ప్లేయర్‌గా అంటిపెట్టుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతడిని రూ. 18 కోట్లు వెచ్చించి రిటైన్ చేసుకోవడానికి ఢిల్లీ సిద్దంగా ఉందంట. పంత్‌తో పాటు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్‌ను ఢిల్లీ రిటైన్ చేసుకున్నట్లు వినికిడి.
ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్ కోసం వెతుకుతోంది. భారత స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఢిల్లీ న్యూ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశముంది. పంత్‌ను ఢిల్లీ టాప్ రిటెన్షన్‌గా అంటిపెట్టుకోనుంది. అతడి కెప్టెన్సీ ఒత్తడి లేకుండా పూర్తిగా తన ఆటపై దృష్టిపెడతాడని మెనెజ్‌మెంట్ భావిస్తోంది అని ఐపీఎల్ మూలాలు వెల్లడించాయి.
చదవండి: IPL 2025: డేల్ స్టెయిన్ సంచలన నిర్ణయం.. ఎస్ఆర్‌హెచ్‌కు గుడ్ బై
Comments
Please login to add a commentAdd a comment