
ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ తమ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్‌ను విడిచిపెట్టనుందా? చెన్నైసూపర్ కింగ్స్‌కు పంత్ వెళ్లనున్నాడా? అంటే అవుననే సమాధనామే ఎక్కువగా వినిపిస్తోంది. తాజాగా రిషబ్ పంత్ చేసిన ట్వీట్ కూడా ఈ వార్తలకు మరింత ఊతమిస్తుంది.
ఒకవేళ నేను ఐపీఎల్ వేలంలో పాల్గొంటే ఎవరైనా కొనుగోలు చేస్తారా లేదా? ఎంత ధరకు అమ్ముడు పోతాను? అంటూ రిషబ్ ఎక్స్‌లోక్రిప్టిక్ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇదే విషయం క్రీడా వర్గాల్లో చర్చానీయంశమైంది. ఈ క్రమంలో కొంతమంది ఢిల్లీ ఫ్రాంచైజీని పంత్ వీడనున్నాడని అభిప్రాయపడుతుంటే, మరి కొంత మంది అతడు ఏదో ఫన్నీగా పోస్ట్ చేసి ఉంటాడని చెప్పుకొస్తున్నారు.
ఢిల్లీ విడిచిపెట్టనుందా?
కాగా ఢిల్లీ క్యాపిటల్స్‌కు కీలకమైన ఆటగాళ్లలో రిషబ్ పంత్ ఒకడనడంలో ఎలాంటి సందేహం లేదు. గత కొన్ని సీజన్ల నుంచి కెప్టెన్‌గానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శన పరంగా కూడా పంత్ అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు.
ఈ ఏడాది సీజన్‌లో కూడా పంత్ అదరగొట్టాడు. ఐపీఎల్-2024లో 446 పరుగులు చేసిన పంత్.. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే ఇటువంటి అద్భుత ఆటగాడిని ఢిల్లీ విడిచిపెట్టే సాహాసోపేత నిర్ణయం తీసకుంటుందో లేదో వేచి చూడాలి. ఒకవేళ అతడు వేలంలోకి వస్తే భారీ ధర పలకడం ఖాయం.