గతేడాది డిసెంబర్‌లో రోడ్డు ప్రమాదానికి గురైన టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పంత్ తన పూర్తి ఫిట్‌నెస్ సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఎప్పటికప్పుడు జిమ్‌లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలను కూడా పంత్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నాడు. ఇక తాజాగా బీసీసీఐ అతడి ఫిటెనెస్‌కు సంబంధించిన మెడికల్ బులెటిన్ కూడా బీసీసీఐ వెల్లడించింది.
పంత్ బ్యాటింగ్ సాధనతో పాటు వికెట్ కీపింగ్ కూడా మొదలు పెట్టినట్లు బీసీసీఐ తెలిపింది. అయితే అతడు పూర్తి స్ధాయి ఫిట్‌నెస్ సాధించడానికి మరో నాలుగు నుంచి ఐదు నెలల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. అంటే భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్-2023కు పంత్ దూరం కానున్నాడు.
అతడు తిరిగి మళ్లీ వచ్చే ఏడాది స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరగున్న టెస్టు సిరీస్‌తో మైదానంలో అడుగు పెట్టనున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరిలో స్వదేశంలో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్‌తో టీమిండియా తలపడనుంది.
ప్రస్తుత టెస్టు జట్టులో పంత్ లేని లోటు సృష్టంగా కన్పిస్తోంది. వెస్టిండీస్‌తో జరగుతున్న టెస్టు సిరీస్‌లో పంత్ స్ధానంలో ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అంతకుముందు డబ్ల్యూటీసీ ఫైనల్, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో శ్రీకర్ భరత్ వికెట్ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు.
చదవండి: IND vs WI: 'అతడు మళ్లీ ఫామ్‌లోకి రావాలి.. ఎందుకంటే రోహిత్ తర్వాత తనే దిక్కు'
Comments
Please login to add a commentAdd a comment