PC: IPL.com
ఐపీఎల్-2023లో భాగంగా మంగళవారం అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. తొలి మ్యాచ్‌లో గెలిచి మంచి జోష్ మీద ఉన్న గుజరాత్ టైటాన్స్.. ఢిల్లీపై కూడా అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి బోణీ కొట్టాలని ఢిల్లీ భావిస్తోంది.
ఢిల్లీ క్యాంప్‌లో పంత్..
అయితే ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ రెగ్యూలర్ కెప్టెన్ రిషబ్ పంత్ అరుణ్‌జైట్లీ స్టేడియంకు రానున్నట్లు సమాచారం. దగ్గరుండి తన జట్టును సపోర్ట్ చేసేందుకు పంత్ స్టేడియం రానున్నాడు. గతేడాది డిసెంబర్ 30న కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్.. నెమ్మదిగా కోలుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అతడు ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యాడు.
"రిషబ్ ఎప్పుడూ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో అంతర్భాగమే. గుజరాత్ టైటాన్స్‌తో జరిగే ఢిల్లీ మొదటి హోం మ్యాచ్‌ను వీక్షించేందుకు పంత్ వచ్చే అవకాశం ఉంది. అతడు స్టేడియంకు వస్తే..కచ్చితంగా జట్టు యజమాని స్పెషల్ బాక్స్ నుంచే మ్యాచ్‌ను వీక్షిస్తాడు.
అందుకు తగ్గట్టు ఏర్పాట్లు ఢిల్లీ క్రికెట్ ఆసోసియషన్ చేస్తోంది. అదే విధంగా బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం, భద్రతా విభాగం అనుమతి ఇస్తే.. అతడు ఢిల్లీ డగౌట్‌లో కూడా కూర్చునే ఛాన్స్ ఉంది" అని ఐపీఎల్ వర్గాలు పీటీఐతో వెల్లడించాయి.
చదవండి: IPL 2023- MS Dhoni: చెత్త బౌలింగ్.. 13 వైడ్‌లు, 3 నోబాల్స్.. పేసర్లకు వార్నింగ్ ఇచ్చిన ధోని.. ఇలాగే కొనసాగితే..
Comments
Please login to add a commentAdd a comment