బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు దూరమైన టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్.. తిరిగి టెస్టు సిరీస్‌తో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇక గత కొంత కాలంగా వైట్‌బాల్ క్రికెట్‌లో పంత్ దారుణంగా విఫలమవుతున్నాడు. ఈ నేపథ్యంలో పంత్ కనీసం ఈ టెస్టు సిరీస్‌తోనైనా తిరిగి ఫామ్‌లోకి రావాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు.
ఇక బంగ్లాదేశ్-భారత మధ్య తొలి టెస్టు ఛాటోగ్రామ్ వేదికగా బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా తన అంచనాలను అభిమానులతో పంచుకున్నాడు. బంగ్లాతో తొలి టెస్టులో విరాట్ కోహ్లి, పంత్ కలిసి కనీసం 125 పరుగులు చేస్తారని ఆకాష్ చోప్రా జోస్యం చెప్పాడు.
తన యూట్యూబ్ ఛానల్‌లో చోప్రా మాట్లాడుతూ.. :"బంగ్లాదేశ్ తొలి టెస్టు మ్యాచ్‌లో విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి కనీసం 125 పరుగులు చేస్తారని నేను భావిస్తున్నాను. పంత్ పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. కాబట్టి జట్టులో ఖచ్చితంగా ఉంటాడు.
అదే విధంగా రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ కలిసి 10 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొడతారని నేను అనుకుంటున్నాను. ఓవరాల్‌గా రెండు ఇన్నింగ్స్‌లోనూ బంగ్లాదేశ్ ఆలౌట్ అవుతుంది. ఆ 20 వికెట్లలో వీరిద్దరూ కలిసి కచ్చితంగా 10 వికెట్లు సాధిస్తారు" అని అతడు పేర్కొన్నాడు.
చదవండి: KL Rahul: అతడిని ఏ ప్రాతిపదికన వైస్ కెప్టెన్ చేశారో తెలీదు.. అయితే పంత్ మాత్రం..
Comments
Please login to add a commentAdd a comment