Live Updates
ఐపీఎల్-2025 మెగా వేలం లైవ్ అప్‌డేట్స్..
ముగిసిన తొలి రోజు వేలం
ఐపీఎల్-2025 మెగా వేలం మొదటి రోజు విజయవంతంగా ముగిసింది. తొలిరోజు వేలంలో 72 మంది ఆటగాళ్లు అమ్ముడుపోయారు. మొత్తం పది ఫ్రాంచైజీలు తొలి రోజు వేలంలో 467.95 కోట్లు ఖర్చుచేశాయి. ఐపీఎల్‌లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా రిషబ్ పంత్(రూ.27 కోట్లు) నిలిచాడు. రిషబ్‌ను లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది.
సుయుష్ శర్మకు రూ. 2.60 కోట్లు
స్పిన్నర్ సుయుష్ శర్మను రూ.2.60 కోట్ల భారీ ధరకు ఆర్సీబీ కొనుగోలు చేసింది.
కరుణ్ శర్మను ముంబై రూ.30 లక్షలకు సొంతం చేసుకుంది.
కుమార్ కార్తీకేయను రాజస్తాన్ రూ.30 లక్షలకు దక్కించుకుంది.
మానవ్ సత్తార్‌ను గుజరాత్ రూ.30 లక్ష్లలకు కొనుగోలు చేసింది.
ముగిసిన తొలి రోజు వేలం..
👉మొహిత్ శర్మను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.2.20 కోట్లకు కొనుగోలు చేసింది.
👉కర్ణాటక పేసర్ విజయ్‌కుమార్ వైశ్యాఖ్‌ను కేకేఆర్ రూ.1.80 కోట్లకు పంజాబ్ దక్కించుకుంది.
👉యష్ ఠాకూర్‌ను రూ.1.80 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది.
👉వైభవ్ ఆరోరాను కేకేఆర్ రూ.1.80 కోట్లకు కేకేఆర్ సొంతం చేసుకుంది.
జమ్మూ కాశ్మీర్ ఫాస్ట్‌బౌలర్‌కు జాక్‌పాట్
👉జమ్మూ కాశ్మీర్ ఫాస్ట్ బౌలర్ రాసిఖ్ సలామ్ భారీ ధర దక్కింది. అతడిని రూ.6 కోట్ల భారీ ధరకు ఆర్సీబీ సొంతం చేసుకుంది.
👉ఉత్తరఖాండ్ ఫాస్ట్ బౌలర్ ఆకాష్ మధ్వాల్‌ను రూ.1.20 కోట్లకు రాజస్తాన్ దక్కించుకుంది.
👉భారత వెటరన్ పేసర్ మొహిత్ శర్మను రూ.2.20 కోట్లకు ఢిల్లీ కొనుగోలు చేసింది.
రాబిన్ మింజ్‌కు రూ. 65 లక్షలు
👉జార్ఖండ్ వికెట్ కీపర్ బ్యాటర్ కుమార్ కుషాగ్రను గుజరాత్ టైటాన్స్ రూ.65 లక్షలకు సొంతం చేసుకుంది.
👉మరో జార్ఖండ్ వికెట్ కీపర్ బ్యాటర్ రాబిన్ మింజ్‌ను రూ. 65 లక్షలకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది.
👉అనూజ్ రావత్‌ను రూ. 30 లక్షలకు గుజరాత్ తమ జట్టులో చేర్చుకుంది.
👉మధ్యప్రదేశ్ ఆటగాడు ఆశ్‌తోష్ శర్మను రూ.3.80 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది.
విజయ్ శంకర్‌కు రూ. 1.20 కోట్లు
👉పంజాబ్ ఆల్‌రౌండర్ హార్‌ప్రీత్ బరార్‌ను పంజాబ్ కింగ్స్ రూ.1.50 కోట్లకు సొంతం చేసుకుంది.
👉తమిళనాడు ఆటగాడు విజయ్ శంకర్‌ను రూ.1.20 కోట్లకు సీఎస్‌కే కొనుగోలు చేసింది.
👉రాజస్తాన్ ఆల్‌రౌండర్ మహిపాల్ లామ్రోర్‌ను రూ.1.70 లక్షలకు గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది.
భారీ ధర పలికిన భారత ఆన్‌క్యాప్డ్ ప్లేయర్లు
👉భారత ప్లేయర్ నమాన్ ధీర్‌ను రూ.5.25 కోట్లకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది.
👉జమ్మూ కాశ్మీర్ స్టార్ ప్లేయర్ అబ్దుల్ సమాద్‌ను రూ.4.20 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది.
అభినవ్ మనోహర్‌కు రూ. 3.20 కోట్లు..
👉కర్ణాటక ఆటగాడు అభినవ్ మనోహర్‌ను రూ. 3.20 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది.
👉 ఉత్తరప్రదేశ్ ఆటగాడు సమీర్ రిజ్వీని రూ.95 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది.
నేహాల్ వదేరాకు రూ.4.20 కోట్లు
పంజాబ్ ఆటగాడు నేహాల్ వదేరాను రూ.4.20 కోట్ల భారీ ధరకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది.
ఆధర్వ తైడేకు రూ.30 లక్షలు
భారత ప్లేయర్ ఆధర్వ తైడేను రూ.30 లక్షలకు ఎస్‌ఆర్‌హెచ్ సొంతం చేసుకుంది.
అఫ్గానిస్తాన్ స్పిన్నర్‌కు రూ.10 కోట్లు
అఫ్గానిస్తాన్ స్పిన్నర్ నూర్ ఆహ్మద్‌ను సీఎస్‌కే రూ.10 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది.
హసరంగాకు రూ.5.25 కోట్లు..
శ్రీలంక స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగాను రూ.5.25 కోట్లకు రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది.
ఎస్‌ఆర్‌హెచ్‌లోకి ఆడమ్ జంపా..
ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపాను రూ.2.40 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది.
ట్రెంట్ బౌల్ట్‌కు రూ.12.50 కోట్లు
న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్‌ను రూ.12.50 కోట్లకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది.
టి నటరాజన్‌కు రూ. 10.50 కోట్లు
టీమిండియా ఫాస్ట్ బౌలర్ టి నటరాజన్‌ను రూ. 10.50 కోట్ల భారీ ధరకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది.
ఖాలీల్ ఆహ్మద్‌కు రూ.4.80 కోట్లు
టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఖాలీల్ ఆహ్మద్‌ను రూ.4.80 కోట్లకు సీఎస్‌కే సొంతం చేసుకుంది.
జోఫ్రా ఆర్చర్‌కు రూ. 12.75 కోట్లు..
ఇంగ్లండ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌ను రూ. 12.75 కోట్ల భారీ ధరకు రాజస్తాన్ కొనుగోలు చేసింది.
అన్రిచ్ నోర్జేకు రూ. 6.50 కోట్లు
అన్రిచ్ నోర్జేను రూ. 6.50 కోట్లకు కోల్‌కతా నైట్‌రైడర్స్ సొంతం చేసుకుంది.
అవేష్ ఖాన్‌కు రూ.9.75 కోట్లు
భారత ఫాస్ట్ బౌలర్ అవేష్ ఖాన్‌ను రూ.9.75 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది.
ప్రసిద్ద్ కృష్ణకు రూ. 9.50 కోట్లు..
టీమిండియా ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ద్ కృష్ణను రూ.9.50 కోట్లకు గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది.
జోష్ హాజిల్ వుడ్‌కు భారీ ధర
ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జోష్ హాజిల్ వుడ్‌ను రూ. 12. 50 కోట్లకు ఆర్సీబీ సొంతం చేసుకుంది.
జితేష్ శర్మకు రూ.11 కోట్లు
టీమిండియా వికెట్ కీపర్ జితేష్ శర్మను రూ.11 కోట్లకు ఆర్సీబీ సొంతం చేసుకుంది.
ఇషాన్ కిషన్‌ను రూ.11.25 కోట్లు
టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌ను రూ.11.25 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది.
అమ్ముడుపోని జానీ బెయిర్‌స్టో
వేలంలో ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జానీ బెయిర్‌స్టో అమ్ముడుపోలేదు. రూ. 2 కోట్ల కనీస ధరతో వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తిచూపలేదు.
ఫిల్ సాల్ట్‌కు రూ. 11.50 కోట్లు
ఫిల్ సాల్ట్‌ను రూ. 11.50 కోట్లకు ఆర్సీబీ దక్కించుకుంది. ఇంగ్లండ్‌కు చెందిన ఫిల్ సాల్ట్ కోసం ఆర్సీబీతో పాటు కేకేఆర్ కూడా తీవ్రంగా పోటీ పడింది. చివరకు ఆర్సీబీ.. సాల్ట్‌ను కొనుగోలు చేసింది.
నామమాత్రపు ధరకే అమ్ముడుపోయిన మార్ష్, మాక్స్‌వెల్
ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్లు మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్ నామమాత్రపు ధరకే అమ్ముపోయారు. మార్ష్‌ను రూ.3.40 ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకోగా, మాక్స్‌వెల్‌ను రూ.4.20 కోట్లకు పంజాబ్ దక్కించుకుంది.
మార్కస్ స్టోయినిష్‌కు రూ. 11 కోట్లు
ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిష్‌ను రూ.11 కోట్లకు పంజాబ్ సొంతం చేసుకుంది.
వెంకటేష్ అయ్యర్ జాక్‌పాట్.. ఏకంగా రూ. 23.75 కోట్లు
ఐపీఎల్-2025 మెగా వేలంలో వెంకటేష్ అయ్యర్‌కు కళ్లు చెదిరే ధర దక్కింది. అయ్యర్‌ను రూ. 23.75 కోట్ల భారీ ధరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది.
అశ్విన్‌పై కాసుల వర్షం.. రూ. 9.75 కోట్లకు సొంతం చేసుకున్న సీఎస్‌కే
టీమిండియా వెటరన్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్‌ను రూ. 9.75 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది.
రచిన్ రవీంద్రకు రూ.4 కోట్లు
కివీస్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్రను రూ.4 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. గత సీజన్‌లో కూడా సీఎస్‌కేకు రచిన్ ఆడాడు.
హర్షల్ పటేల్‌ను దక్కించుకున్న ఎస్‌ఆర్‌హెచ్
టీమిండియా ఆల్‌రౌండర్ హర్షల్ పటేల్‌ను రూ.8 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది.
ఆసీస్ ఆటగాడికి జాక్‌పాట్..
ఆస్ట్రేలియా యువ ఓపెనర్ జాక్ ఫ్రెజర్ మెక్‌గర్క్‌ను రూ. 9 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.
వేలంలో అమ్ముడుపోని డేవిడ్ వార్నర్
ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అమ్ముడు పోలేదు.
రాహుల్ త్రిపాఠికి రూ. రూ.3.4 కోట్లు
భారత ఆటగాడు రాహుల్ త్రిపాఠిని రూ.3.4 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. గత సీజన్‌లో అతడు ఎస్‌ఆర్‌హెచ్ తరపున ఆడాడు.
డెవాన్ కాన్వేను దక్కించుకున్న సీఎస్‌కే
న్యూజిలాండ్ వికెట్ కీపర్ డెవాన్ కాన్వేను రూ.6.25 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. కాగా కాన్వే గత సీజన్లలో కూడా సీఎస్‌కేకే ప్రాతినిథ్యం వహించాడు.
ఐడైన్ మార్‌క్రమ్‌కు షాక్..
దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడైన్ మార్‌క్రమ్‌ను రూ. 2 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది.
అమ్ముడుపోని టీమిండియా ప్లేయర్
ఐపీఎల్ వేలంలో టీమిండియా ప్లేయర్ దేవ్‌దత్త్ పడిక్కల్ అమ్ముడు పోలేదు. రూ. 2 కోట్ల బేస్‌ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన అతడిని కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపలేదు.
హ్యారీ బ్రూక్‌కు రూ.6.25 కోట్లు..
వేలంలో ఇంగ్లండ్ విధ్వంసకర ఆటగాడు హ్యారీ బ్రూక్‌ను రూ.6.25 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.
కేఎల్ రాహుల్‌కు ఊహించిన దానికంటే తక్కువే
ఐపీఎల్ మెగా వేలం-2025లో భారత వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ నామమాత్రపు ధర పలికాడు. ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 14 కోట్లకు అతడిని సొంతం చేసుకుంది. కాగా ఐపీఎల్-2022 నుంచి 2024 వరకు రాహుల్ లక్నో కెప్టెన్‌గా వ్యవహరించాడు. రెండుసార్లు ఆ జట్టును ప్లే ఆఫ్స్‌చేర్చాడు.
అయితే, లక్నో ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గోయెంకాతో విభేదాల నేపథ్యంలో ఆ జట్టును వీడినట్లు వార్తలు వచ్చాయి. అయితే, కెప్టెన్ కోసం చూస్తున్న జట్లు రాహుల్ కోసం భారీ ధరను వెచ్చిస్తాయనుకంటే.. ఒక రకంగా ఢిల్లీ తక్కువ ధరకే కొట్టేసింది.
లివింగ్ స్టోన్‌కు రూ.8.75 కోట్లు
ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్ స్టోన్‌ను రూ.8.75 కోట్లకు ఆర్సీబీ సొంతం చేసుకుంది.
మహ్మద్ సిరాజ్‌కు రూ. 12.25 కోట్లు..
ఐపీఎల్ మెగా వేలంలో టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌కు జాక్ పాట్ తగిలింది. రూ. 12.25 కోట్లకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. కనీస ధర రూ.2 కోట్లు ఉన్న సిరాజ్ కోసం గుజరాత్, చెన్నై పోటీపడ్డాయి. ఆఖరికి సీఎస్‌కే పోటీ నుంచి తప్పుకోవడంతో గుజరాత్ దక్కించుకుంది.
చహల్‌కు కళ్లు చెదిరే ధర.. ఎన్ని కోట్లంటే?
ఐపీఎల్-2025 మెగా వేలంలో టీమిండియా స్పిన్నర్ యుజువేంద్ర చహల్‌కు కళ్లు చెదిరే దక్కింది. రూ. 18 కోట్లకు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది.
డేవిడ్ మిల్లర్‌ను కొన్న లక్నో
లక్నో సూపర్ జెయింట్స్ సౌతాఫ్రికా హిట్టర్ డేవిడ్ మిల్లర్‌ను సొంతం చేసుకుంది. అతడి కోసం రూ. 7.5 కోట్లు వెచ్చించింది. ఐపీఎల్-2024లో మిల్లర్ గుజరాత్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు.
షమీ హైదరాబాద్ సొంతం
టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీపై చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఆసక్తి చూపాయి. అయితే, అనూహ్యంగా రేసులోకి వచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 10 కోట్లకు షమీని సొంతం చేసుకుంది.
రిషబ్ పంత్‌కు రూ.27 కోట్లు.. నిమిషాల్లో అయ్యర్ రికార్డు బ్రేక్
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడు పోయిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ క్యాష్ రిచ్ మెగా వేలంలో పంత్‌ను రూ. 27 కోట్ల భారీ ధరకు లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది.
జోస్ బట్లర్‌కు రూ.15.75 కోట్లు.. దక్కించుకున్న గుజరాత్
ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్‌ను రూ.15.75 కోట్ల భారీ ధరకు గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది.
శ్రేయస్ అయ్యర్ సరికొత్త చరిత్ర..
ఐపీఎల్-2025 మెగా వేలంలో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌పై కాసుల వర్షం కురిసింది. అయ్యర్‌ను రూ.26. 75 కోట్ల భారీ ధరకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా స్టార్‌పేసర్ మిచెల్ స్టార్క్(రూ.24.75 కోట్లు) పేరిట ఉండేది. కాగా ఈ వేలంలో అయ్యర్ కోసం ఢిల్లీ, పంజాబ్ తీవ్రంగా పోటీపడ్డాయి. ఆఖరికి ఢిల్లీ పోటీ నుంచి తప్పుకోవడంతో అయ్యర్ పంజాబ్ సొంతమయ్యాడు.
రబాడను రూ.10.75 కోట్లకు దక్కించుకున్న గుజరాత్ టైటాన్స్
దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడను రూ.10.75 కోట్ల భారీ ధరకు గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది.
అర్ష్‌దీప్ సింగ్‌కు జాక్ పాట్.. రూ. 18 కోట్లకు సొంతం చేసుకున్న పంజాబ్
ఐపీఎల్-2025 మెగా వేలం టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌తో ప్రారంభమైంది. ఈ మెగా వేలంలో అమ్ముడు పోయిన తొలి ప్లేయర్‌గా టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ నిలిచాడు. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అర్ష్‌దీప్ సింగ్ కోసం తొలుత ఢిల్లీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఎస్‌కే గుజరాత్ టైటాన్స్ , రాజస్తాన్ రాయల్స్ పోటీ పడ్డాయి.ఆఖరిలో పంజాబ్ కింగ్స్ ఎంట్రీ ఇచ్చింది. అతడిని పంజాబ్ రూ.18 కోట్లకు ఆర్టీమ్ ఆప్షన్ ద్వారా పంజాబ్ సొంతం చేసుకుంది.
జెద్దా వేదికగా ఐపీఎల్-2025 మెగా వేలం ప్రారంభమైంది. ఈ వేలంలో ఆక్షనర్‌గా మల్లికా సాగర్ వ్యహరిస్తున్నారు. మొత్తం ఈ వేలంలో 577 మంది ప్లేయర్లు తమ ఆదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొత్తం పది ఫ్రాంచైజీలు 204 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు సిద్దమయ్యాయి. ఫ్రాంచైజీల చేతిలో మొత్తంగా రూ. 641.50 కోట్లు నగదు ఉంది. అత్యధికంగా పంజాబ్ కింగ్ పర్స్‌లో రూ 110.50 కోట్లు ఉన్నాయి.