ENG vs IND: Rishabh Pant Gifts Champagne Bottle To Ravi Shastri - Sakshi
Sakshi News home page

ENG vs IND: రవిశాస్త్రికి షాంపైన్ బాటిల్‌ గిఫ్ట్‌ ఇచ్చిన పంత్‌.. వీడియో వైరల్‌..!

Published Mon, Jul 18 2022 1:20 PM | Last Updated on Mon, Jul 18 2022 3:23 PM

Rishabh Pant gifts champagne bottle to Ravi Shastri - Sakshi

మాంచెస్టర్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన అఖరి వన్డేలో భారత్‌ విజయం సాధించన సంగతి తెలిసిందే. కాగా టీమిండియా విజయంలో వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ కీలక పాత్ర పోషించాడు. తొలత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ ఇంగ్లండ్‌ 45.5 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌటైంది. 260 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 72 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ పరిస్ధితుల్లో పంత్‌ హార్ధిక్ పాండ్యాతో కలిసి ఐదో వికెట్‌కి 133 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. అనంతరం పాండ్యా ఔటైనప్పటికీ..  పంత్‌ మాత్రం అఖరి వరకు క్రీజులో నిలిచి మ్యాచ్‌ను ముగించాడు.

ఈ మ్యాచ్‌లో పంత్‌ 113 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్లతో సాయంతో 125 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనకు గాను పంత్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు వరించింది. అవార్డు ప్రజేంటేషన్ సమయంలో పంత్‌కు నగదుతో పాటు షాంపైన్ బాటిల్‌ని కూడా  నిర్వాహకులు అందజేశారు. అయితే షాంపైన్ బాటిల్‌ అందుకున్న పంత్‌ ఎవరూ ఊహించని పని చేశాడు.

ఈ మ్యాచ్‌కు కామెం‍టర్‌గా వ్యవహరిస్తున్న భారత మాజీ హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రికి షాంపైన్ బాటిల్‌ పంత్‌ గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా భారత హెడ్‌ కోచ్‌గా రవిశాస్త్రి ఉన్న సమయంలోనే పంత్‌ జట్టలోకి ఎంట్రీ ఇచ్చాడు. పంత్‌ తన తొలి దశలో చాలా మ్యాచ్‌ల్లో విఫలమైన్పటకి.. అతడికి అవకాశాలు తరుచగా ఇస్తూ రవిశాస్త్రి సపోర్టుగా నిలిచాడు.
చదవండి: ENG vs IND: సెంచరీతో చెలరేగిన పంత్‌..వన్డేల్లో అరుదైన రికార్డు..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement