England Vs India, 3rd ODI: Hardik Pandya Becomes First Indian Pick Four Or More Wickets In The Same Match In All Three Formats - Sakshi
Sakshi News home page

ENG vs IND: చరిత్ర సృష్టించిన హార్ధిక్‌ పాండ్యా.. తొలి భారత ఆటగాడిగా..!

Published Mon, Jul 18 2022 8:22 AM | Last Updated on Mon, Jul 18 2022 12:08 PM

Hardik Pandya becomes first Indian pick four or more wickets in the same match in all three formats - Sakshi

మాంచెస్టర్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన అఖరిలో వన్డేలో భారత్‌ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దాంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది. కాగా భారత విజయంలో పంత్‌, హార్ధిక్‌ పాండ్యా కీలక పాత్ర పోషించారు. పంత్ ‌(113 బంతుల్లో 125 నాటౌట్‌; 16 ఫోర్లు, 2 సిక్స్‌లు)  వీరోచిత సెంచరీతో చెలరేగగా.. హార్ధిక్‌ బంతితోను, బ్యాట్‌తోను అద్భుతంగా రాణించాడు.

బౌలింగ్‌లో కేవలం 24 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టిన హార్ధిక్‌.. బ్యాటింగ్‌లో 71 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. కాగా పాండ్యాకు తన వన్డే కెరీర్‌లో ఇవే అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు కావడం విశేషం. ఇక ఈ మ్యాచ్‌లో ఆల్‌ రౌండ్‌ షోతో అదరగొట్టిన పాండ్యా పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అవి ఏమిటో ఓ లుక్కేద్దాం.


పాండ్యా రికార్డులు
మూడు ఫార్మాట్లలో ఒకే మ్యాచ్ లో నాలుగు పైగా వికెట్లు తీసి..  50 ప్లస్‌ పరుగులు చేసిన తొలి భారత్‌ క్రికెటర్‌గా పాండ్యా చరిత్ర సృష్టించాడు.

టెస్టులు: 52 రన్స్‌ అండ్‌ 5/28 వర్సెస్‌ ఇంగ్లండ్‌-2018
వన్డేలు: 71 పరుగులు అండ్‌ 4/24 వర్సెస్‌ ఇంగ్లండ్‌-2022
టీ20లు: 51 రన్స్‌ అండ్‌ 4/33 వర్సెస్‌ ఇంగ్లండ్‌-2022

ఇక ప్రపంచ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్‌గా హార్ధిక్‌ నిలిచాడు. అంతకుముందు పాక్ ఆల్ రౌండర్ మహ్మద్ హఫీజ్ ఈ ఫీట్ సాధించాడు.

ఇక వన్డేలో ఫిప్టీ ప్లస్‌ పరుగులు నాలుగు వికెట్లు పడగొట్టిన ఐదో భారత ఆటగాడిగా పాండ్యా రికార్డులకెక్కాడు. అంతుముం‍దు కృష్ణమాచారి శ్రీకాంత్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్ ఈ ఘనత సాధించారు.

మాంచెస్టర్‌లో వన్డేలలో అత్య్తుమ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేసిన మూడో భారత ఆటగాడిగా హార్దిక్‌ రికార్డు సృష్టించాడు.


ఇండియా వర్సెస్‌ ఇంగ్లండ్‌ మూడో వన్డే
వేదిక: మాంచెస్టర్‌
టాస్‌: ఇండియా- బౌలింగ్‌
ఇంగ్లండ్‌ స్కోరు: 259 (45.5)
ఇండియా స్కోరు: 261/5 (42.1)
విజేత: భారత్‌.. 5 వికెట్ల తేడాతో గెలుపు
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: రిషబ్‌ పంత్‌(125 పరుగులు)

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


చదవండిWI vs IND: భారత్‌తో వన్డే సిరీస్‌.. జట్టును ప్రకటించిన వెస్టిండీస్‌.. స్టార్‌ ఆల్‌రౌండర్‌ వచ్చేశాడు!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement