Ind vs WI, 2nd Test: Ishan Kishan's one handed six reminds everyone of Rishabh Pant - Sakshi
Sakshi News home page

IND vs WI: ఇషాన్‌ కిషన్‌ సింగిల్‌ హ్యాండ్‌ సిక్స్‌.. పంత్‌ను గుర్తు చేశాడుగా! వీడియో వైరల్‌

Published Mon, Jul 24 2023 1:17 PM | Last Updated on Mon, Jul 24 2023 2:21 PM

Ishan Kishans one handed six reminds everyone of Rishabh Pant - Sakshi

PC: KHEL NOW

టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ తన పవర్‌ హిట్టింగ్‌ను టెస్టు క్రికెట్‌లో కూడా చూపించాడు. విండీస్‌తో తొలి టెస్టులో విఫలమైన కిషన్‌.. రెండో టెస్టులో మాత్రం సూపర్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. భారత రెండో ఇన్నింగ్స్‌లో కిషన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 33 బంతుల్లో తొలి హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఓవరాల్‌గా 34 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 52 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.

అయితే కిషన్‌ తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను తనదైన స్టైల్‌లో అందుకున్నాడు. భారత ఇన్నింగ్స్‌ 24 ఓవర్‌ వేసిన రోచ్‌ బౌలింగ్‌లో ఐదో బంతిని కిషన్‌ ఒంటి చెత్తో సిక్సర్‌గా మలిచాడు. దీంతో తన హాఫ్‌ సెంచరీని కూడా పూర్తిచేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  అయితే కిషన్‌ తన సింగిల్‌ హ్యాండ్‌ షాట్‌తో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ను గుర్తుచేశాడని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు.

పంత్‌ గతంలో ఈ తరహా షాట్స్‌ చాలా ఆడాడు.  కాగా గతేడాది డిసెంబర్‌లో రోడ్డు ప్రమాదంలో గాయపడిన పంత్‌.. క్రమంగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో ఉన్నాడు. అతడు వచ్చే ఏడాది జనవరిలో ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌తో  తిరిగి మళ్లీ మైదానంలో అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇక పంత్‌ స్ధానంలోనే కిషన్‌కు టెస్టు జట్టులో చోటు దక్కింది.
చదవండి: IND vs WI: రోహిత్‌ శర్మ అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement