IPL 2024 LSG vs DC Live Updates :
ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. ఏక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయం సాధించింది. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ.. 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది.
ఢిల్లీ బ్యాటర్లలో అరంగేట్ర ఆటగాడు జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్(55) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రిషబ్ పంత్(41) మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. లక్నో బౌలర్లలో రవి బిష్ణోయ్ రెండు వికెట్లు పడగొట్టగా.. యష్ ఠాకూర్, నవీన్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది.
లక్నో బ్యాటర్లలో బదోని(55 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కేఎల్ రాహుల్(39) పరుగులతో రాణించాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఖాలీల్ ఆహ్మద్ రెండు, ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్ తలా వికెట్ పడగొట్టారు.
ఢిల్లీ నాలుగో వికెట్ డౌన్.. పంత్ ఔట్
రిషబ్ పంత్ రూపంలో ఢిల్లీ నాలుగో వికెట్ కోల్పోయింది. 41 పరుగులు చేసిన పంత్.. బిష్ణోయ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఢిల్లీ విజయానికి 24 బంతుల్లో 18 పరుగులు కావాలి.
ఢిల్లీ మూడో వికెట్ డౌన్..
140 పరుగుల వద్ద ఢిల్లీ మూడో వికెట్ కోల్పోయింది. 55 పరుగులు చేసిన ఫ్రెజర్ ముక్‌గర్క్.. నవీన్ ఉల్‌హక్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఢిల్లీ విజయానికి 32 బంతుల్లో 28 పరుగులు కావాలి. క్రీజులో రిషబ్ పంత్(37) పరుగులతో ఉన్నాడు.
దంచి కొడుతున్న పంత్.. 12 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 100/2
12 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ రెండు వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ దూకుడుగా ఆడుతున్నాడు. క్రీజులో పంత్(29), ముక్‌గర్క్(25) పరుగులతో ఉన్నారు.
10 ఓవర్లు ఢిల్లీ స్కోర్ : 75/2
10 ఓవర్లకు ఢిల్లీ క్యాపిటల్స్ రెండు వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. క్రీజులో జాక్ ఫ్రెజర్ ముగ్‌గార్క్(21), రిషబ్ పంత్(8) పరుగులతో ఉన్నారు.
రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. పృథ్వీ షా ఔట్
63 పరుగుల వద్ద ఢిల్లీ క్యాపిటల్స్ రెండో వికెట్ కోల్పోయింది. 32 పరుగులు చేసిన పృథ్వీ షా.. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 7 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 63/2
తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. వార్నర్ ఔట్
168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్.. యష్ ఠాకూర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 4 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 30/1
బదోని సూపర్ ఇన్నింగ్స్.. ఢిల్లీ టార్గెట్ 168 పరుగులు
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన లక్నోను యువ ఆటగాడు ఆయుష్ బదోని ఆదుకున్నాడు.
టెయిలాండర్ ఆర్షద్ ఖాన్(20)తో కలిసి తన జట్టుకు మెరుగైన స్కోర్‌ను అందించాడు. బదోని(55 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కేఎల్ రాహుల్(39) పరుగులతో రాణించాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఖాలీల్ ఆహ్మద్ రెండు, ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్ తలా వికెట్ పడగొట్టారు.
17 ఓవర్లకు లక్నో స్కోర్: 128/7
17 ఓవర్లు ముగిసే సరికి లక్నో 7 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. క్రీజులో ఆయూష్ బదోని(30), ఆర్షద్ ఖాన్(9) పరుగులతో ఉన్నారు.
లక్నో ఏడో వికెట్ డౌన్..
94 పరుగుల వద్ద లక్నో ఏడో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన కృనాల్ పాండ్యా.. ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 13 ఓవర్లకు లక్నో స్కోర్ : 94/7
90 పరుగులకే 6 వికెట్లు.. కష్టాల్లో లక్నో
89 పరుగుల వద్ద లక్నో ఆరో వికెట్ కోల్పోయింది. 10 పరుగులు చేసిన దీపక్ హుడా.. వార్నర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 12 ఓవర్లకు లక్నో స్కోర్ : 90/6
కుల్దీప్ మాయ.. లక్నో ఐదో వికెట్ డౌన్
80 పరుగుల వద్ద లక్నో ఐదో వికెట్ కోల్పోయింది. 39 పరుగులు చేసిన కేఎల్ రాహుల్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 11 ఓవర్లకు లక్నో స్కోర్ : 84/5
కుల్దీప్ మాయ.. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు
కుల్దీప్ యాదవ్ దెబ్బకు లక్నో సూపర్ జెయింట్స్ ఒకే ఓవర్‌లో వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. తొలుత మార్కస్ స్టోయినిష్ ఔట్ కాగా.. తర్వాత నికోలస్ పూరన్ క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి దీపక్ హుడా ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చాడు. 9 ఓవర్లకు లక్నో స్కోర్ : 75/4. క్రీజులో రాహుల్(39), హుడా (3) పరుగులతో ఉన్నారు.
లక్నో రెండో వికెట్ డౌన్..
పడిక్కల్ రూపంలో లక్నో సూపర్ జెయింట్స్ రెండో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన దేవ్‌దత్త్ పడిక్కల్.. ఖాలీల్ ఆహ్మద్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 5 ఓవర్లు ముగిసే సరికి లక్నో రెండు వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్(21), స్టోయినిష్(1) పరుగులతో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన లక్నో..
28 పరుగుల వద్ద లక్నో సూపర్ జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన క్వింటన్ డికాక్.. ఖాలీల్ ఆహ్మద్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి దేవ్‌దత్త్ పడిక్కల్ వచ్చాడు.
ఐపీఎల్-2024లో భాగంగా ఏక్నా స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ రెండు మార్పులతో బరిలోకి దిగగా.. లక్నో మాత్రం ఒకే మార్పు చేసింది. ఢిల్లీ జట్టులోకి ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ వచ్చారు. అదేవిధంగా ఈ మ్యాచ్‌కు లక్నో సంచలన పేసర్ మయాంక్ యాదవ్ దూరమయ్యాడు.
తుది జట్లు
ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, షాయ్ హోప్, రిషబ్ పంత్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్
లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డి కాక్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, అర్షద్ ఖాన్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, యశ్ ఠాకూర్
Comments
Please login to add a commentAdd a comment