ఇటీవల జెడ్డాలో జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో టీమిండియా క్రికెటర్ 'రిషబ్ పంత్' ఏకంగా రూ.27 కోట్ల ధరకు పలికాడు. వికెట్ కీపర్, బ్యాటర్ అయిన పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ (LSG) సొంతం చేసుకుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండూ కూడా పంత్ కోసం పోటీపడి ఊరుకున్నాయి.
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచిన రిషబ్ పంత్.. 27 కోట్ల రూపాయలకు పలికినప్పటికీ, పన్నులు వంటివి పోగా అతని చేతికి వచ్చే డబ్బు చాలా తగ్గుతుంది. పంత్ ఐపీఎల్ వేతనంలో కొంత శాతం ట్యాక్స్ రూపంలో పొందుతుంది. భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం ట్యాక్స్ రూపంలో ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.8.1 కోట్లు చేరుతుంది. అంటే పంత్ చేతికి వచ్చే డబ్బు రూ. 18.9 కోట్లన్నమాట.
డిసెంబర్ 2022లో రోడ్డుప్రమాదం నుంచి బయటపడిన పంత్‌కు మోకాలి సర్జరీ జరిగింది. ఆ తరువాత పంత్ క్రికెట్ ఆడలేడేమో అని అందరూ భావించారు. కానీ పట్టువదలని విక్రమార్కునిలా మళ్ళీ బ్యాట్ చేతపట్టుకున్నాడు. టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ఇప్పుడు ఐపీల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డ్ క్రియేట్ చేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment