బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. రెండో రోజు ఆటలో గాయపడ్డ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్.. మూడో రోజు ఆటకు దూరమయ్యాడు.
అతడి గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మూడో రోజు ఆటకు పంత్ మైదానంలో అడుగుపెట్టలేదు. అతడి స్ధానంలో ధ్రువ్ జురెల్ సబస్ట్యూట్ వికెట్ కీపర్‌గా కొనసాగుతున్నాడు.
ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. "పంత్ ప్రస్తుతం మా వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. మూడో రోజు అతడు వికెట్ కీపింగ్‌కు దూరంగా ఉండనున్నాడని" బీసీసీఐ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
అసలేం జరిగిందంటే?
కివీస్ ఇన్నింగ్స్ 37వ ఓవర్లో రవీంద్ర జడేజా వేసిన బంతిని కివీస్ బ్యాటర్ డెవాన్ కాన్వే షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఈ క్రమంలో బాల్ ఆఫ్ స్టంప్ మీదుగా వచ్చి పంత్ మెకాలికి బలంగా తాకింది.
దీంతో అతడు నొప్పితో విలవిల్లాడుతూ మైదానాన్ని వీడాడు. అయితే తొలి రోజు ఆట అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ పంత్ గాయంపై అప్‌డేట్ ఇచ్చాడు. ఇటీవల సర్జరీ చేయించుకున్న మోకాలికే గాయం అయిందని, మేం ఎలాంటి రిస్క్ తీసుకోలేమని అన్నాడు. పంత్ ఈ మ్యాచ్‌లో పునరాగమనం చేస్తాడని ఆశిస్తున్నాం అంటూ రోహిత్ చెప్పుకొచ్చాడు.
కాగా వచ్చే నెలలో కీలకమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరగనుండంతో ముందు జాగ్రత్తగా పంత్‌ను కివీస్ సిరీస్ నుంచి తప్పించే అవకాశముంది. ఈ మ్యాచ్‌లో కూడా పంత్ తిరిగి మైదానంలో అడుగుపెట్టే అవకాశాలు తక్కువగా కన్పిస్తున్నాయి. ఒకవేళ పంత్ దూరమైతే ధ్రువ్ జురెల్ తుది జట్టులోకి రానున్నాడు. జురెల్ ఇప్పటికే తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్నాడు.
UPDATE: Mr Rishabh Pant will not keep wickets on Day 3.
The BCCI Medical Team is monitoring his progress.
Follow the match - https://t.co/FS97Llv5uq#TeamIndia | #INDvNZ | @IDFCFIRSTBank— BCCI (@BCCI) October 18, 2024
Comments
Please login to add a commentAdd a comment