
టీమిండియా కీపర్ రిషబ్ పంత్ తన టెస్టు క్రికెట్ రీఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు. చెపాక్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పంత్ అద్భుతమైన శతకంతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 39 పరుగులతో రాణించిన పంత్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం సూపర్ సెంచరీతో చెలరేగాడు.
టీ20 క్రికెట్‌ను తలపిస్తూ బంగ్లా బౌలర్లను ఊతికారేశాడు. యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్‌తో కలిసి భారత స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 128 బంతులు ఎదుర్కొన్న రిషబ్.. 13 ఫోర్లు, 4 సిక్స్‌లతో 109 పరుగులు చేశాడు. పంత్‌కు ఇది ఆరువ టెస్టు సెంచరీ కావడం గమనార్హం. ఈ క్రమంలో పంత్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
ఎంఎస్ ధోని రికార్డు సమం..
టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు సెంచరీలు చేసిన భారత వికెట్ కీపర్‌గా లెజెండరీ ఆటగాడు ఎంఎస్ ధోని రికార్డును పంత్ సమం చేశాడు. ధోనీ 90 టెస్టుల్లో ఈ మైలురాయిని చేరుకోగా, పంత్ కేవలం 34 మ్యాచ్‌ల్లోనే ఈ రికార్డును అందుకున్నాడు.
మరో సెంచరీ చేస్తే ధోనిని పంత్ అధిగమిస్తాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బంగ్లాదేశ్ ముందు భారత్ 515 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. మూడో రోజు ఆట ముగిసే సరికి బంగ్లా.. 37.2 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ విజయం సాధించాలంటే ఇంకో 357 పరుగులు అవసరం.
చదవండి: 53 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి!
WELCOME BACK TO TEST CRICKET, RISHABH PANT! 🙌🏻💯#RishabhPant #INDvBAN #IDFCFirstBankTestSeries #JioCinemaSports pic.twitter.com/C4gJuv29Y1
— JioCinema (@JioCinema) September 21, 2024