బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో 8 వికెట్ల తేడాతో భారత్ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. దీంతో మూడు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 1-0 వెనకంజలో నిలిచింది. ఈ క్రమంలో ఆక్టోబర్ 24 నుంచి పుణే వేదికగా జరగనున్న రెండో టెస్టులో ఎలాగైనా గెలిచి సిరీస్ సమం చేయాలని భారత జట్టు భావిస్తోంది.
అందుకు తగ్గట్టే టీమిండియా మెనెజ్‌మెంట్ వ్యూహాలు రచిస్తోంది. రెండో టెస్టుకు భారత జట్టులో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను సెలక్టర్లు చేర్చారు. అంతేకాకుండా పేసర్ ఆకాష్ దీప్‌ను కూడా ఫుణే టెస్టులో ఆడించాలని భారత జట్టు మెనెజ్‌మెంట్ భావిస్తుందంట.
రిషబ్ పంత్ దూరం?
ఇక కివీస్ రెండో టెస్టుకు ముందు భారత్‌కు భారీ షాక్ తగిలే అవకాశముంది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ గాయం కారణంగా పుణే టెస్టుకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. మొదటి టెస్టులో పంత్ మోకాలికి గాయమైంది. దీంతో తొలి టెస్టు నాలుగో రోజు ఆట మొత్తానికి పంత్ దూరమయ్యాడు.
ఆ తర్వాత భారత సెకెండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన పంత్(99) అద్భుతమైన ప్రదర్శన చేశాడు. కానీ పంత్ బ్యాటింగ్‌కు వచ్చినప్పటకి ఇంకా పూర్తి ఫిట్‌నెస్ మాత్రం సాధించినట్లు కన్పించలేదు. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం బ్యాటింగ్ మాత్రమే చేసిన పంత్ ఫీల్డింగ్‌కు మాత్రం రాలేదు.
అతడి స్ధానంలో ధ్రువ్ జురెల్ వికెట్ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. ఈ క్రమంలోనే రెండో టెస్టుకు పంత్‌కు విశ్రాంతి ఇవ్వాలని గంభీర్ ఎండ్ కో యోచిస్తున్నట్లు సమాచారం. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు అతడిని ఆడించి ఎటువంటి రిస్క్ తీసుకోడదని జట్టు మెనెజ్‌మెంట్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
చదవండి: T20 WC 2024: వరల్డ్ ఛాంపియన్స్‌గా న్యూజిలాండ్.. ప్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే?
Comments
Please login to add a commentAdd a comment