సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు, టీమిండియా టీ20 ప్లేయర్ అభిషేక్ శర్మ ఓ లోకల్ టీ20 టోర్నమెంట్‌లో (టైమ్స్ షీల్డ్ టోర్నీ) చెలరేగిపోయాడు. తాజాగా జరిగిన ఓ మ్యాచ్‌లో అభిషేక్ 22 బంతుల్లో 60 పరుగులు చేశాడు. అభిషేక్ భారీ షాట్లు అడుతున్న వీడియో ఒకటి సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలొ అభిషేక్ ఆడిన షాట్లు చూస్తుంటే ఐపీఎల్ 2025 సీజన్ కోసం గట్టిగానే కసరత్తు చేస్తున్నాడనిపిస్తుంది.
ABHISHEK SHARMA SHOW IN TIMES SHIELD TOURNAMENT...!!! 🙇
- While playing in the red ball, Abhishek smashed 60 runs from just 22 balls, preparing hard for the 2025 season. pic.twitter.com/smqEHcOxNl— Johns. (@CricCrazyJohns) December 10, 2024
అభిషేక్ ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లోనూ పర్వాలేదనిపించాడు. ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన అభిషేక్.. చివరి రెండు మ్యాచ్‌ల్లో తన ప్రతాపం చూపించాడు. మూడో టీ20లో 25 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేసిన అభిషేక్.. నాలుగో మ్యాచ్‌లో 18 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 36 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌ను సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా 3-1 తేడాతో కైవసం చేసుకుంది.
అభిషేక్ ఐపీఎల్ ప్రదర్శన విషయానికొస్తే.. గత సీజన్‌లో అభిషేక్ చెలరేగిపోయాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్‌కు చేరడంలో అభిషేక్ కీలకపాత్ర పోషించాడు. ఈ సీజన్‌లో మొత్తం 16 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్.. 204.22 స్ట్రయిక్ రేట్‌తో 484 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అభిషేక్ గత మూడు ఐపీఎల్ సీజన్లుగా రాణిస్తూ వస్తున్నాడు. అందుకే సన్‌రైజర్స్ అతన్ని వేలానికి వదిలి పెట్టకుండా అట్టిపెట్టుకుంది. ఐపీఎల్ కెరీర్‌లో మొత్తం 63 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్.. 155.24 స్ట్రయిక్‌రేట్‌తో 1377 పరుగులు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment