బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి విఫలమయ్యాడు. అభిషేక్ ఈ సిరీస్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 16, 15, 4 పరుగులు చేశాడు. యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్‌ల గైర్హాజరీలో జట్టులో చోటు దక్కించుకున్న అభిషేక్ అంచనాలకు తగ్గట్టుగా రాణించలేక ఉసూరుమనిపించాడు.
ఇటీవలే జింబాబ్వేపై మెరుపు సెంచరీ చేసిన అభిషేక్‌పై భారీ అంచనాలు ఉండేవి. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణించగలడని మేనేజ్‌మెంట్ అతనిపై విశ్వాసం ఉంచింది. అయితే అభిషేక్ అందరి అంచనాలను వమ్ము చేస్తూ తేలిపోయాడు. ప్రస్తుతమున్న కాంపిటీషన్‌లో అభిషేక్‌కు మరోసారి జట్టులో చోటు దక్కడం కష్టమే.
కాగా, హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా 23 పరుగుల వద్దే అభిషేక్ శర్మ వికెట్ కోల్పోయింది. అయితే సంజూ శాంసన్ (25 బంతుల్లో 59; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (18 బంతుల్లో 42; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి ఆడుతున్నారు. వీరిద్దరూ ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిసున్నారు. 8 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 113/1గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment