Update:
సౌతాఫ్రికాతో తొలి టీ-20లో శాంసన్ సెంచరీ
47 బంతుల్లో సెంచరీ చేసిన శాంసన్
7 ఫోర్లు, 9 సిక్స్‌లతో చెలరేగిన శాంసన్
10 ఓవర్ల అనంతరం టీమిండియా స్కోర్ 99/2.. సంజూ శాంసన్ (59 బ్యాటింగ్), తిలక్ వర్మ (7 బ్యాటింగ్)
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. అభిషేక్ తన టీ20 కెరీర్‌లో ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక సెంచరీ చేశాడు. మిగతా అన్ని మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు. తాజాగా అభిషేక్ మరోసారి చెత్త షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టీ20లో అభిషేక్ 8 బంతుల్లో బౌండరీ సాయంతో 7 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ తొలి బంతి నుంచి చాలా ఇబ్బంది పడ్డాడు. బంతిని కనెక్ట్ చేసుకోలేక సతమతమయ్యాడు.
గెరాల్డ్ కొయెట్జీ బౌలింగ్ భారీ షాట్‌కు ప్రయత్నించి మార్క్రమ్ చేతికి చిక్కాడు. అభిషేక్ వరుసగా అవకాశాలు ఇస్తున్నా విఫలమవుతుండటంతో భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభిషేక్‌కు గేమ్ పట్ల సీరియస్‌నెస్ లేదని కామెంట్స్ చేస్తున్నారు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో అభిషేక్ మరో మ్యాచ్‌లో ఫెయిల్ అయితే టీమిండియా తలుపులు తట్టలేడని అంటున్నారు.
కాగా, నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా డర్బన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టీ20లో సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. సౌతాఫ్రికా ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన భారత్ చెలరేగి ఆడుతుంది. అభిషేక్ నిరాశపరిచినప్పటికీ.. సంజూ శాంసన్ దుమ్ములేపుతున్నాడు. సంజూ 20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 35 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. మరో ఎండ్‌లో సూర్యకుమార్ యాదవ్ కూడా ధాటిగానే ఆడుతున్నాడు. స్కై 8 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్ సాయంతో 14 పరుగులు చేశాడు. 6 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 56/1గా ఉంది.
దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్, ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, పాట్రిక్ క్రుగర్, మార్కో జాన్సెన్, ఆండిల్ సిమెలన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, న్కాబయోమ్జి పీటర్
భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్‌కీపర్), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment