త్వరలో శ్రీలంకతో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం భారత జట్లను ఇవాళ (జులై 18) ప్రకటించారు. వన్డే జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా కొనసాగనుండగా.. టీ20 జట్టు నూతన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ ఎంపికయ్యాడు.
ఇరు జట్లకు వైస్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ వ్యవహరించనుండగా.. రిషబ్ పంత్, రియాన్ పరాగ్, శుభ్‌మన్ గిల్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్ రెండు జట్లలో చోటు దక్కించుకున్నారు.
వన్డే జట్టుకు హర్షిత్ రాణా కొత్తగా ఎంపిక కాగా.. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వన్డేల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. టీ20 వరల్డ్‌కప్ అనంతరం పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్, కోహ్లి వన్డేల్లో కొనసాగనుండగా.. హార్దిక్ పాండ్యాకు వన్డే జట్టులో చోటు దక్కలేదు.
రుతురాజ్, అభిషేక్‌లకు మొండిచెయ్యి.. వన్డేల్లో సంజూను నో ఛాన్స్
తాజాగా జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో సెంచరీతో మెరిసిన అభిషేక్ శర్మ.. గత ఏడు టీ20 ఇన్నింగ్స్‌ల్లో 70కి పైగా సగటుతో పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్ రెండు జట్లలో (టీ20, వన్డే) చోటు దక్కించుకోలేకపోయారు. టీ20ల్లో ఫస్ట్ ఛాయిస్ ఓపెనర్లుగా శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ ఎంపికయ్యారు. తానాడిన చివరి వన్డేలో (సౌతాఫ్రికా) సెంచరీ చేసిన సంజూ శాంసన్ వన్డే జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.
కాగా, టీమిండియా.. మూడు మ్యాచ్‌ల టీ20, వన్డే సిరీస్‌ల కోసం శ్రీలంకలో పర్యటించనుంది. ఈ పర్యటనలో తొలుత టీ20 సిరీస్ జరుగనుంది. ఈ నెల 27, 28, 30 తేదీల్లో మూడు టీ20లు జరుగనున్నాయి. అనంతరం ఆగస్ట్ 2, 4, 7 తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి. టీ20 సిరీస్ మొత్తం పల్లెకెలెలో.. వన్డే సిరీస్ కొలొంబోలో జరుగనుంది.
భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రింకూ సింగ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్
భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా.
Comments
Please login to add a commentAdd a comment