
ఎమర్జింగ్ ఆసియా కప్-2024ను భారత్-ఎ జట్టు విజయంతో ఆరంభించింది. శనివారం చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత యువ ఆటగాడు అభిషేక్ శర్మ, పాకిస్తాన్ స్పిన్నర్ సూఫియాన్ ముఖీమ్ మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది.
భారత ఇన్నింగ్స్ 7 ఓవర్ వేసిన సూఫియాన్ బౌలింగ్‌లో తొలి బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించి అభిషేక్ క్యాచ్ ఔటయ్యాడు. వెంటనే ముఖీమ్ సెలబ్రేషన్స్‌లో మునిగితేలిపోయాడు. అయితే అతడి సంబరాలు శ్రుతిమించాయి. అభిషేక్ తిరిగి పెవిలియన్‌కు వెళ్తున్న క్రమంలో అభిషేక్ వైపు చూస్తూ ముఖీమ్ ఏదో తిడుతూ, బయటకు వెళ్లాలంటూ సైగలు చేశాడు.
దీంతో చిర్రెత్తిపోయిన అభిషేక్ శర్మ.. ముఖీమ్‌పై దూసుకెళ్లాడు. అయితే అంపైర్‌లు జోక్యం చేసుకోవడంతో అభిషేక్ మైదాన్ని వీడాడు. ఇందుకు సబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ మ్యాచ్‌లో 22 బంతులు ఎదుర్కొన్న అభిషేక్ శర్మ 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 35 పరుగులు చేశాడు.
Dear Abhishek Sharma, these are not ipl bowlers.pic.twitter.com/MlrGP5ZV2k
— Maaz (@Im_MaazKhan) October 19, 2024