న్యూఢిల్లీ: ఈ సారి జనభా లెక్కలను గణించడం కోసం మొబైల్ యాప్‌ను వినియోగించబోతున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘2021లో గణించబోయే జనాభాలెక్కల కోసం మొబైల్ యాప్‌ను వినియోగించబోతున్నాం. పేపర్ సెన్సస్ నుంచి డిజిటల్ సెన్సెస్ వైపు ప్రయాణించబోతున్నాం’ అన్నారు. చివరిసారిగా 2011లో జనాభా లెక్కలని గణించిన సంగతి తెలిసిందే. అప్పటికి మన దేశ జనాభా 121 కోట్లు. ఈ క్రమంలో 2021, మార్చి 1 నుంచి నూతన జనాభా లెక్కలను గణించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మంచు కురిసే ప్రాంతాలైన జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో 2020 అక్టోబర్ నుంచే జనాభాను గణించన్నుట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment