
నిజానికి మా పార్టీ చీఫ్ ఆయనే!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ మార్పుపై జరగుతున్న చర్చ విషయమై ఆ పార్టీ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్‌గాంధీయేనని, ఆయన అధికారికంగా పార్టీ అధ్యక్ష పదవి చేపట్టాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత వచ్చేవరకు మీనమేషాలు లెక్కించడం కంటే ఇప్పుడే ఎన్నికలకు పార్టీ సిద్ధం చేయాల్సిన బాధ్యత రాహుల్‌పై ఉందని జైరాం అభిప్రాయపడ్డారు.
భారత్ లో వస్తున్న మార్పులకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ వైఖరి కూడా మారాల్సిన తరుణం ఆసన్నమైందని, కమ్యూనికేషన్ విషయంలో పార్టీ పటిష్టంగా లేదని, వరుస ఎన్నికల ఓటమి నేపథ్యంలో మరింత దూకుడుగా ప్రజలకు చేరువయ్యేందుకు పార్టీ అధినాయకత్వం కృషి చేయాల్సిన అవసరముందని జైరాం సూచించారు.