
కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారిగా కరోనా వైరస్ సోకినట్టుగా భారీగా నష్టం జరిగిందన్నారు.
కొచ్చి: మైనార్టీ మతవాదంపై కాంగ్రెస్ పార్టీ సామరస్య ధోరణితో ఉంటుందన్న ప్రచారంపై ఆ పార్టీ సీనియర్ నాయకుడు జైరామ్ రమేష్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), షహీన్‌బాగ్ నిరసనల్ని ప్రచార అస్త్రంగా చేసుకొని బీజేపీ ఓట్లను చీల్చడం వల్ల ఆ పార్టీ గెలవలేదు కానీ, ఎక్కువ నష్టం జరిగింది కాంగ్రెస్‌కేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారిగా కరోనా వైరస్ సోకినట్టుగా భారీగా నష్టం జరిగిందన్నారు. మెజార్టీ ప్రజల మనోభావాల పట్ల కూడా సున్నితంగా వ్యవహరించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఏకే ఆంటోని చేసిన వ్యాఖ్యల్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ముస్లిం మతవాదంపై తాము చూసీ చూడనట్టు వ్యవహరిస్తామన్న దుష్ప్రచారం సాగుతోందని జైరామ్ రమేష్ ఆందోళన వ్యక్తం చేశారు. (చదవండి: అలాంటి మాటలు వాడకుంటే బావుండేది)