కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌బెహార్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీకి ముందు.. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2021లో బీజేపీని తిరస్కరించినందుకు పశ్చిమ బెంగాల్ ప్రజలపై మోదీ ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుందని అన్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఓట్లు అడిగేందుకు అవసరమైనప్పుడు మాత్రమే ప్రధాని పశ్చిమ బెంగాల్‌కు వస్తారు. గతంలో జరిగిన ఎన్నికలకు ముందు ప్రచారం సమయంలో మాత్రమే మోదీ రాష్ట్రంలో పర్యటించారు. ఎన్నికల తరువాత దేశమంతా పలుమార్లు పర్యటించారు, కానీ పశ్చిమ బెంగాల్‌కి ఎప్పుడూ మోదీకి రావాలనిపించలేదని జైరాం రమేష్ అన్నారు.
మోదీ ప్రభుత్వం బెంగాల్ ప్రజల మీద ప్రతీకారం తీర్చుకుంటోంది. కేంద్రం నుంచి రావాల్సిన ఎన్నో నిధులు ఆగిపోయాయి. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన, జాతీయ ఆరోగ్య మిషన్, జల్ జీవన్ మిషన్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలకు ప్రభుత్వం నిధులను ఇవ్వడం ఆపేసింది.
తన పార్టీ సమగ్రతకు ప్రతిరూపమని మనం విశ్వసించాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నారు. కానీ పశ్చిమ బెంగాల్‌లో జరిగిన అనేక సంఘటనలు వారి అసమర్ధతను తెలియజేస్తున్నాయి. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి టీఎంసీ నేత తపస్ రాయ్‌పై ఈ ఏడాది జనవరిలో ఈడీ దాడులు చేసింది. కేవలం 3 నెలల తర్వాత, మార్చిలో.. రాయ్ బీజేపీలో చేరారు. ఇప్పుడు కోల్‌కతా ఉత్తర లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈడీ ప్రోబ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రధానమంత్రి 'భ్రష్టాచార్ హటావో' నినాదం సిగ్గులేకుండా దేశవ్యాప్తంగా మార్మోగిందని జైరాం రమేష్ అన్నారు.
గూర్ఖాలాండ్ సమస్యకు పరిష్కారం కోసం గూర్ఖాలు తమ దీర్ఘకాల డిమాండ్లను పునరుద్ధరించినప్పుడు గత సంవత్సరం డార్జిలింగ్‌లో విస్తృత నిరసనలు చెలరేగాయి. గత ఎన్నికల మేనిఫెస్టోలలో, బీజేపీ డార్జిలింగ్ హిల్స్, సిలిగురి తెరాయ్, డోర్స్ ప్రాంత సమస్యకు శాశ్వత రాజకీయ పరిష్కారం అందిస్తామని హామీ ఇచ్చింది. కానీ నెరవేర్చలేదని జైరాం రమేష్ అన్నారు.
Today, the Prime Minister is on his way to Cooch Behar in West Bengal. There is perhaps no state whose people have suffered more at the hands of the Modi Sarkar. The PM should use this opportunity to answer for all his government’s failings in West Bengal:
— Jairam Ramesh (@Jairam_Ramesh) April 4, 2024
1. It seems like the…
Comments
Please login to add a commentAdd a comment