
'మోదీ కి గ్యారెంటీ' అనే బీజేపీ నినాదంపై కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జి జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మొదట 'గ్యారెంటీ' అనే పదాన్ని వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ఉపయోగించారని పేర్కొన్నారు.
ఎన్నికల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ వారెంటీ గడువు ముగియబోతోందని జైరాం రమేష్ అన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కర్ణాటక, తెలంగాణలలో అమలవుతున్నాయి. గ్యారెంటీ అనే మాట కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ ఉపయోగించారని ఆయన అన్నారు.
మోదీ కి గ్యారెంటీ అనే పదం జూలై 26న ఢిల్లీలో భారత మండపాన్ని ప్రారంభిస్తున్నప్పుడు ప్రధాని మొదట ఉపయోగించారు. ఇదే నేడు బీజేపీ వారంటీగా మారిపోయింది. ఇప్పటికే మోదీ గ్యారెంటీలకు జీరో వారంటీ ఉందని 'జన గర్జన్ సభ' ర్యాలీ సందర్భంగా టీఎంసీ నాయకుడు 'అభిషేక్ బెనర్జీ' పేర్కొన్న విషయాన్ని జైరాం రమేష్ ప్రస్తావించారు.
బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన 'జన గర్జన్ సభ' ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, 'మోదీ కి గ్యారెంటీ' జీరో వారెంటీ అని, మమతా బెనర్జీ, టీఎంసీ మాత్రమే హామీలను నిలబెట్టుకుంటాయని అభిషేక్ అన్నారు. బీజేపీ నాయకులు బయటి వ్యక్తులని, బెంగాల్ వ్యతిరేకులని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాష్ట్రాన్ని సందర్శిస్తారని ఆయన వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment