ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు (సోమవారం) కర్ణాటక శివమొగ్గలో పర్యటిస్తున్నారు. మోదీ తన పర్యటనలో రాష్ట్రంలోని కీలక సమస్యలను ప్రస్తావిస్తారని ఆశిస్తున్నట్లు కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
రాష్ట్రంలోని 236 తాలూకాలలో 223 కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. చాలా ప్రాంతాలలో తీవ్రమైన కరువు పరిస్థితుల కారణంగా కర్ణాటక తీవ్ర నీటి సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. కరువు సాయం కోసం రూ.18,172 కోట్ల నిధులు విడుదల చేయాలని మోదీ సర్కార్‌ను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కర్ణాటక ప్రజలకు సాయం చేసేందుకు మోదీ సర్కార్ ఎందుకు నిరాకరించింది?
గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై కరువు సంబంధిత ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడాలని విన్నవించింది. దీనికోసం కర్ణాటక ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) క్రింద పనిదినాల సంఖ్యను 100 నుండి 150కి పెంచాలని కోరింది. అయితే, మోదీ సర్కార్ పథకం పొడిగింపును ఆమోదించడమే కాకుండా.. దీనికోసం MGNREGS కింద పనిచేస్తున్న వారికి వేతనాల చెల్లింపు కోసం రూ. 1600 కోట్లు చెల్లించాలి. ఈ వేతనాలను మోదీ ప్రభుత్వం ఎప్పుడు చెల్లించబోతోంది?
2023లో అధికారం చేపట్టినప్పటి నుంచి కర్ణాటక ప్రభుత్వం అన్న భాగ్య పథకం ద్వారా పేద కుటుంబాలకు అదనంగా 5 కిలోల బియ్యాన్ని అందించడానికి చేస్తున్న ప్రయత్నాలను మోడీ ప్రభుత్వం భగ్నం చేసింది. పథకం డిమాండ్లను తీర్చేందుకు అవసరమైన 2.28 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కర్ణాటక ప్రభుత్వానికి విక్రయించేందుకు నిరాకరించింది. ఇదంతా కేవలం రాజకీయ ప్రతీకారామేనా?
శివమొగ్గ, బీజేపీ మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కుమారుడు బీవై రాఘవేంద్ర ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ సెగ్మెంట్. కర్ణాటక రాష్ట్ర వంశ రాజకీయాలపైన బీజేపీ వైఖరి ఏమిటి? ప్రధాని స్పష్టం చేయాలని అన్నారు.
The Prime Minister is in Shivamogga, Karnataka today. We hope he addresses some of the key issues in the state in his address:
— Jairam Ramesh (@Jairam_Ramesh) March 18, 2024
1.Karnataka is reeling under an acute water crisis due to severe drought situation in most parts of the state, with 223 of the state’s 236 Talukas…
Comments
Please login to add a commentAdd a comment