
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తు న్న వేళ రాష్ట్ర రైతాంగాన్ని ఆకట్టుకొనే ప్రయత్నా లను కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. రైతులకు చుక్కలు చూపుతున్న ధరణి పోర్టల్ సమస్యలకు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే పరిష్కారం చూపుతామంటూ ఏకంగా ‘హామీ కార్డులు’ జారీ చేస్తోంది.
పెద్దపల్లి నియోజకవర్గంలో పైలట్ ప్రా జెక్టు కింద ఈ ‘హామీ కార్డుల’జారీని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్, కాంగ్రెస్ రాష్ట్ర వ్య వహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే సమక్షంలో ప్రారంభించిన టీపీసీసీ.. కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని చెబుతోంది. ఇందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోంది.
ఫొటోతో కార్డు..: ధరణి పోర్టల్ లావాదేవీల ద్వారా రాష్ట్రంలోని 20 లక్షల మంది రైతుల ఖాతాల్లో సమస్యలున్నాయని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. దీనికి పరిష్కారంలో భాగంగా రైతుల ఫొటోలు, వివరాలతోపాటు ధరణి పోర్టల్‌లో ఎదురవుతున్న సమస్యలను కార్డు ముందు భాగంలో ముద్రిస్తోంది. తాము అధికారంలోకి రాగానే ఈ కార్డులను తహసీల్దార్ లేదా రెవెన్యూ అధికారులకు చూపిస్తే సమస్య పరిష్కారం అవుతుందని సూచిస్తోంది.
ఈ కార్డుల జారీ కంటే ముందు రాష్ట్రంలోని ప్రతి మండలంలో ఐదుగురు ‘భూరక్షక్’లను నియమించాలని పార్టీ నిర్ణయించింది. భూరక్షక్‌లకు ధరణి పోర్టల్‌పై అవగాహన కల్పించి సమస్యల పరిష్కారంపై శిక్షణ ఇప్పించనుంది. వారు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ‘ధరణి అదాలత్’లు నిర్వహించనున్నారు. ఆయా గ్రామ పరిధిలో ధరణి పోర్టల్ ద్వారా ఇబ్బందులు పడుతున్న రైతుల వివరాలు నమోదు చేసుకొని వారికి కార్డులు అందించనున్నారు.
టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కోట నీలిమ నేతృత్వంలోని ఓ బృందం ఈ కార్యాచరణ కోసం కొన్ని నెలలుగా అధ్యయనం చేస్తోందని, ఈ అధ్యయనంలో వెల్లడైన అంశాలు, అభిప్రాయాల మేరకు ముందుకెళుతున్నామని గాం«దీభవన్ వర్గాలు వెల్లడించాయి.
మన భూమి–మన హక్కు: జైరాం రమేశ్
రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ధరణి అదాలత్‌లు నిర్వహిస్తామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ వెల్లడించారు. ధరణి పోర్టల్ అంటే ఒకరి స్థానంలో మరొకరి ఫొటో పెట్ట డం కాదని, ఎవరి భూమిపై వారికి హక్కులు కల్పించాలని, మన భూమి–మన హక్కు పేరుతో ఇందుకోసం కాంగ్రెస్ పోరాడుతుందని ఆయన చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమగ్ర భూసర్వే చేపడతామని, రైతుల పక్షపాతిగా వారి సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తామని జైరాం రమేశ్ హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment