మహిళను రోడ్డుపై పడేసి.. పెప్పర్ స్ప్రే చల్లి.. | US Cop Throws Woman On Ground Uses Pepper Spray On Her | Sakshi
Sakshi News home page

మహిళపై పోలీసు దౌర్జన్యం.. రోడ్డుపై పడేసి.. పెప్పర్ స్ప్రే చల్లి..

Published Wed, Jul 5 2023 2:49 PM | Last Updated on Wed, Jul 5 2023 3:28 PM

US Cop Throws Woman On Ground Uses Pepper Spray On Her - Sakshi

అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ నల్లజాతీయురాలిని పోలీసు నడిరోడ్డుపై పడేశాడు. అనంతరం ఆమెను కాలితో అదుముతూ పెప్పర్‌ స్ప్రే చల్లాడు. ఊపిరాడటం లేదని మహిళ చెబుతున్నా.. వినకుండా దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఆ పోలీసుపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేశారు.

లాంకాస్టర్‌లోని వింకో కిరాణా దుకాణంలో దొంగతనానికి సంబంధించిన కేసులో ఓ వ్యక్తి, మహిళ నిందితులుగా ఉన్నారు. వీరివురు రోడ్డుపై కనిపించగా.. పోలీసులు వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. మొదట ఆ వ్యక్తిని పట్టుకుని సంకేళ్లు వేశారు. ఆ దృశ్యాలను మహిళ వీడియో తీస్తుంది. దీనిని గమనించిన పోలీసు కోపంతో ఆమె వైపు దూసుకొచ్చాడు. అనంతరం మహిళను పట్టుకుని రోడ్డుపైనే లాగి పడేశాడు. ఆ తర్వాత ఆమెను కాలుతో అదుముతూ పెప్పర్ స్ప్రే చల్లాడు. బాధిత మహిళ ఇప్పటికే క్యాన్సర్‌తో పోరాడుతోంది. 

ఈ మొత్తం సన్నివేశాన్ని పక్కనే కారులో ఉన్న మరో వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇది కాస్త నెట్టింట తెగ వైరల్‌ అయింది. పోలీసుల దురుసు ప్రవర్తనపై నెటిజన్లు ఫైరయ్యారు. ప్రతి వ్యక్తికి గౌరవం ఇవ్వాలని కోరారు. ఈ ఘటనపై స్బందించిన పోలీసు విభాగం.. సదరు పోలీసులను విధుల నుంచి తప్పించినట్లు చెప‍్పారు. దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. 

ఇదీ చదవండి: ఆకాశంలో తలకిందులుగా ఆగిపోయిన రోలర్ కోస్టర్..   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement