నటి కోపంతో పెప్పర్ స్ప్రే తీసింది! | Viola Davis 'wanted to pepper spray' Jared Leto | Sakshi
Sakshi News home page

నటి కోపంతో పెప్పర్ స్ప్రే తీసింది!

Published Sat, Jun 25 2016 11:13 AM | Last Updated on Mon, Sep 4 2017 3:23 AM

నటి కోపంతో పెప్పర్ స్ప్రే తీసింది!

నటి కోపంతో పెప్పర్ స్ప్రే తీసింది!

లండన్: హాలీవుడ్ నటి వియోలా డెవిస్ కాస్తయితే తన పెప్పర్ స్ప్రేకు పని చెప్పేదట. అది కూడా తను నటిస్తున్న సినిమాలోనే జోకర్ పాత్ర చేస్తున్న జారెడ్ లిటో మీద చల్లడానికి. 'ఒక్కసారిగా కోపంతో అతిడి మీద పెప్పర్ స్ప్రే చల్లాలనుకున్నాను' అని వియోలా మీడియాతో మాట్లాడుతూ వెల్లడించింది.

వియోలాకు అంతలా ఎందుకు కోపం వచ్చిందంటే.. ఇటీవల ఆమె నటించిన 'సూసైడ్ స్క్వాడ్' చిత్రంలో జారెడ్ లిటో జోకర్ పాత్రలో నటించాడు. షూటింగ్ సమయంలో జారెడ్ తన సహనటులకు 'సరదా'గా కొన్ని గిఫ్ట్లు పంపించాడు. ఆ గిఫ్ట్లు ఎలాంటివంటే ఒకరికి ప్రాణంతో ఉన్న ఎలుక, మరొకరికి అడల్ట్ మేగజైన్, టీం మొత్తానికి కలిపేమో చనిపోయిన పంది. అందులో భాగంగా వియోలాకు ఓ బుల్లెట్ బాక్స్ను అతడు పంపాడు. అది చూసి ఆమె భయపడిందట. అయితే 'సూసైడ్ స్క్వాడ్' షూటింగ్ పూర్తయిన తరువాత మొదటిసారి జారెడ్ను కలిసినప్పుడు 'కోపంతో అతడిపై చల్లడానికి పెప్పర్ స్ప్రే తీశాను' అంటూ అతడు పంపిన సరదా గిఫ్ట్‌లను గురించి వియోలా వెల్లడించింది. విల్ స్మిత్ నటించిన సూసైడ్ స్క్వాడ్ ఆగస్టు 5న విడుదలకానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement