ట్విటర్ లో వర్మ కితకితలు!
సంచలన దర్శకుడిగా సినీ పరిశ్రమలో పేరు సంపాదించుకున్న రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన, వ్యంగ్యం, వివాదస్పద వ్యాఖ్యలతో సెన్సేషనల్ గా మారారు. సోషల్ మీడియాలో రాంగోపాల్ వర్మ గమ్మత్తైన సెటైర్లతోనే కాకుండా, వ్యక్తులపై వ్యంగ్యస్థాలను విసరడంలో వర్మ డిఫెరెంట్ స్టైల్ ను ఫాలోఅవుతుంటారు. ఇటీవల కాలంలో దయ్యాల కథలతో తెరపై హారర్ సృష్టిస్తున్న వర్మ సోషల్ మీడియాలో హాస్యాన్ని పంచుతూ తనలో మరో కోణం ఉందనిపించుకుంటున్నారు.
ఇటీవల కాలంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ , లగడపాటి రాజగోపాల్, లోకసభ స్పీకర్ మీరా కుమార్ పై చేసిన చాలా ఆసక్తిని రేకెత్తించాయి.
ఎప్పుడూ తలచుట్టూ మఫ్లర్ కట్టుకుని కనిపించే కేజ్రివాల్ పై గమ్మత్తైన ట్వీట్ చేశారు వర్మ. 'రానున్న వేసవి కాలం కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే తలకు మఫ్లర్ లేని కేజ్రివాల్ ను చూడాలని ఉంది' అని ట్వీట్ చేశారు. అంతేకాక ఇక కేజ్రివాల్ కాదు.. కేజ్రిఫాల్ అంటూ సెటైర్ వేశారు.
పెప్పర్ స్ప్రే ఘటన తర్వాత లగడపాటిని టార్గెట్ చేశారు. భగత్ సింగ్ తర్వాత పార్లమెంట్ ను కుదిపేసిన రెండవ వ్యక్తి లగడపాటి. పార్లమెంట్ లో ఏం జరిగిందో పక్కన పెడితే.. ప్పెప్పర్ స్పే ను ఆత్మరక్షణ ఆయుధంగా ఉపయోగించుకోవచ్చని లగడపాటి పబ్లిసిటీ ఇచ్చారు. భవిష్యత్ ఉద్యమకారులకు పెప్పర్ స్పే ఓ మంచి ఆయుధంగా మారే అవకాశం ఉంది. త్వరలోనే క్లాస్ రూమ్, సినిమా హాళ్లలో, షాపింగ్ మాల్స్ లో పెప్పర్ స్పే వినియోగించడం త్వరలోనే చూస్తాం అని ట్వీట్ చేశారు.
అంతేకాక కాకుండా మిర్చి పౌడర్ కంటే పెప్పర్ స్పే ఘాటుగా ఉంటుందా అనే కుతుహలం మొదలైందన్నారు వర్మ. ఇంకా ఓ అడుగు ముందేసి .. ఎప్పుడూ చిరునవ్వుతో దర్శనమిచ్చే స్పీకర్ మీరా కుమార్ ..పెప్పర్ స్పే ఘటన తర్వాత ఆమె ముఖంలో నవ్వు మాయమైంది అని ట్విటిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు లోకసభ ఆమోదం లభించిన తర్వాత.. బ్రేకింగ్ న్యూస్ అనౌన్స్ డ్... బ్రేకింగ్ ఆంధ్రప్రదేశ్ అంటూ వర్మ ట్విట్ చేశారు.
దేశంలో జరుగుతున్న అనేక సంఘటనలపై స్పందిస్తూ.. సెటైర్లతో నెటిజన్లకు ఆనందాన్ని పంచుతున్న రాంగోపాల్ ట్విటర్ అకౌంట్ లో 8 లక్షల 17 వేల మంది వర్మను ఫాలో అవుతున్నారు.