Lagadapati Rajgopla
-
చిలుక పలుకులపై ముందే హెచ్చరించిన వైఎస్ జగన్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రీపోల్, ఎగ్జిట్ పోల్ సర్వేల ఫలితాలను మించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీ దిశగా దూసుకెళ్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 149 పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. టీడీపీ కేవలం 23 సీట్లలో మాత్రమే ఆధిక్యంలో ఉంది. జనసేన ఒక స్థానానికే పరిమితమయ్యేలా కనిపిస్తోంది. లోక్‌సభ ఫలితాల్లో 25కి 24 స్థానాల్లో వైఎస్సార్సీపీ ఆధిక్యంలో ఉంది. ఎగ్జిట్ పోల్ సర్వే పేరుతో చంద్రబాబు ఆస్థాన చిలుకగా పేరొందిన లగడపాటి రాజగోపాల్ విడుదల చేసిన ఫలితాలు అసలు ఫలితాలకు కనీసం దరిదాపులకు కూడా సరితూగలేదు. కొన్ని మీడియా సంస్థలు చంద్రబాబునాయుడుతో కుమ్మకై లగడపాటిలాంటి దొంగ సర్వేలను ముందుకు తెస్తారని ఇంతకు ముందే వైఎస్ జగన్ హెచ్చరించారు. కాంగ్రెస్‌పార్టీ, తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాబోతోందని ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ఎన్నికలకు 36 గంటల ముందు లగడపాటి వచ్చాడని ఎన్నికల ప్రచార సభలో వైఎస్ జగన్ చెప్పారు. లగడపాటి సర్వే చేస్తే దాన్ని ఎల్లో మీడియా నెత్తికేసుకుని మోసాయని తెలిపారు. ఆ తర్వాత తెలంగాణలో వచ్చిన ఫలితాలతో లగడపాటి సర్వే ఎలాంటిదో దేవుడు సినిమా చూపించాడని అన్నారు. వైఎస్ జగన్ చెప్పినట్టుగానే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు ముందు కూడా తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వస్తుందంటూ సర్వే పేరుతో లగడపాటి చిలుక పలుకులు పలికిన విషయం తెలిసిందే. -
లగడపాటి దొంగ సర్వేలు: వైఎస్ జగన్
-
చంద్రబాబు స్కెచ్‌లో భాగమే లగడపాటి సర్వే
సాక్షి, హైదరాబాద్: చంద్రబాబు స్కెచ్‌లో భాగమే లగడపాటి రాజగోపాల్ శనివారం సాయంత్రం ప్రకటించిన సర్వే అని వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి విమర్శించారు. ‘చంద్రబాబు స్కెచ్‌లో భాగమే లగడపాటి రాజగోపాల్ సర్వే. 23న కౌంటింగ్ ప్రారంభం కాగానే బాబు ఏమంటాడంటే.. గెలుస్తామని లగడపాటి చెప్పాడు. అయినా ఓడుతున్నామంటే అందుకు ఈవీఎం ట్యాంపరింగే కారణం అని చెప్పేందుకే ఈ గోల. లగడపాటి ఆంధ్రా ఆక్టోపస్ కాదు.. ఎల్లో జలగ!’ అని శనివారం ట్వీట్ చేశారు. ‘లగడపాటి గారూ.. మీ పేరును నారా రాజగోపాల్‌గా మార్చుకోండి’ అని కూడా విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా సూచించారు. బాబుకు మీడియా ‘నయీం’ బ్లాక్మెయిల్ తనను రక్షించకపోతే చంద్రబాబు రహస్యాలన్నీ బయట పెడతానని మీడియా ‘నయీం’ రవిప్రకాష్ బ్లాక్‌మెయిలింగ్‌కు దిగాడంటూ విజయసాయిరెడ్డి శనివారం మరో ట్వీట్ చేశారు. ‘ఏదో ఒకటి చేసి రక్షించకపోతే చంద్రబాబు రహస్యాలన్నీ బయటపెడతానని బ్లాక్‌మెయిల్‌కు దిగాడట మీడియా ‘నయీం’. 23 తర్వాత తన పరిస్థితి ఏమిటో అంతుబట్టక చంద్రబాబు సతమతమవుతుంటే ఇతను, శివాజీ, దాకవరపు అశోక్, హర్షవర్ధన్ చౌదరిల బెదిరింపులతో చంద్రబాబు కుంగిపోతున్నాడట. వీళ్లంతా ఇంత ఈజీగా దొరికిపోయారేంటని మొత్తుకుంటున్నాడట’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. రీ పోలింగ్ అంటే ఎందుకు వణికిపోతున్నారు ‘చంద్రగిరిలో 7 పోలింగ్ బూత్‌లలో రీ పోలింగ్ అంటేనే ఇంతగా వణికిపోతున్నారేంటి చంద్రబాబూ.. ఈసీపై దాడికి పురమాయించేంత తప్పేం జరిగిందని? ఏ పార్టీ ఓటర్లు ఆ పార్టీకి ఓటేస్తారు. ఓడిపోయినట్లు గంగవెర్రులెందుకు? పాతికేళ్లుగా దళితులను ఓటు హక్కుకు దూరం చేసిన మీ నిజ స్వరూపం బయటపడినందుకా?’ అని విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు. చంద్రబాబు స్కెచ్ లో భాగమే లగడపాటి సర్వే. 23న కౌంటింగ్ ప్రారంభం కాగానే బాబు ఏమంటాడంటే ... గెలుస్తామని లగడపాటి చెప్పాడు అయినా ఓడుతున్నామంటే అందుకు ఈవీఎం ట్యాంపరింగే కారణం అని చెప్పేందుకే ఈ గోల. ఆంధ్రా ఆక్టోపస్ కాదు... ఇది ఎల్లో జలగ! — Vijayasai Reddy V (@VSReddy_MP) 18 May 2019 -
రాష్ట్ర ప్రజలు టీఆర్ఎస్ వైపే
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల తరుణంలో ప్రజల దృష్టిని మరల్చేందుకు మహాకూటమి నేతలు చిల్లర వ్యూహాలకు తెరలేపుతున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రజలు టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నారని తెలిసి చివరగా సర్వేల పేరిట మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. బుధవారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. ‘లగడపాటి రాజగోపాల్, నేను వాట్సాప్‌లో ఎన్నికలపై మెసెజ్‌లు పంపుకున్నాం. నవంబర్ 20న టీఆర్ఎస్కు 65 నుంచి 70 సీట్లు వస్తాయని అప్పుడు నాకు మెసేజ్ పెట్టారు. అదే విషయాన్ని చంద్రబాబుకు పంపానని తెలిపారు. అయితే వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందని, టీఆర్ఎస్కు ప్రజల్లో ఆదరణ ఉందని చెప్పాను. నవంబర్ 20 తర్వాత రాజగోపాల్ ఎలాంటి సర్వేలు చేయలేదు. రెండు పత్రికలతో కలసి మైండ్‌గేమ్ ఆడుతున్నారు. గత ఎన్నికల్లో ఏపీలో ఇలాంటివే చేశారు. ఇప్పుడూ అదే చేస్తున్నారు. గోబెల్స్‌కు చంద్రబాబు తమ్ముడిలాంటి వారు. ఓటమి భయంతో సర్వేల పేరుతో ఏదో చేయాలని చూస్తున్నారు. రాజగోపాల్ చిలకజోస్యాలు చెల్లవు. ఆయన జోస్యం చెప్పాలనుకుంటే రెండు చిలుకలు పంపిస్తాం. ఇప్పటికైనా ఆయన చిల్లర పనులు ఆపాలి. ప్రచారాన్ని అడ్డుకుంటారా..? కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి చేసిన దాన్ని ఎవరూ సమర్థించొద్దు. ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకుంటానని ఆయన ప్రకటించారు. రాహుల్‌గాంధీ విషయంలో మేం అలాగే ప్రకటిస్తే ఎలా ఉంటుంది. ఆ అంశంపై ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. మాది ఆపద్ధర్మ ప్రభుత్వం. ఆ అంశంతో సంబంధం లేదు. హైకోర్టు వ్యాఖ్యలు న్యాయస్థానం అభిప్రాయం. రాహుల్‌గాంధీకి ఏ విషయంపైనా అవగాహన లేదు. కుంజలాన్ ప్రాజెక్టును కుంభకర్ణ ప్రాజెక్టు అంటున్నారు. నేను కేసీఆర్ కొడుకుగానే రాజకీయాల్లోకి వచ్చినా.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఇక్కడి దాకా చేరుకున్నా. రాహుల్ పేరులో గాంధీ అనే తోక తీసేస్తే ఆయన ఏంటి? ప్రజలు, దేశం కోసం ఆయన ఏ ఉద్యమాలు చేశారు. ఎన్నికల్లో మహాకూటమి, రాహుల్ ఇచ్చిన హామీలు విచిత్రంగా ఉన్నాయి. డబుల్ బెడ్రూం ఇళ్లకు ఓసారి ఉచి త సాయం అంటారు.. మళ్లీ రుణం అంటారు. రూ.2 లక్షల రుణమాఫీ అంటారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక, పంజాబ్‌లో ఎందుకు చేయట్లేదు. బీజేపీకి ఒక్క సీటు రాదు.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీని మేం సమర్థించాం. నోట్ల రద్దుతో ప్రజలకు మేలు జరుగుతుందని భావించాం. అదేమీ జరగలేదు. రాజ్యసభ చైర్మన్ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీ అభ్యర్థి కాబట్టే బీజేడీకి మద్దతిచ్చాం. తెలుగు వ్యక్తి కాబట్టి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు తెలిపాం. అంతేతప్ప బీజేపీతో మాకు ఎలాంటి సంబంధంలేదు. రాష్ట్రంలో బీజేపీ లేదు. మా ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్. అందుకే ఆ పార్టీని లక్ష్యంగా చేసుకుని మా రాజకీయ వ్యూహం ఉంటోంది. బీజేపీకి రాష్ట్రంలో ఒక్క సీటు రాదు. డిసెంబర్ 11 తర్వాత ఏదైనా జరగొచ్చు. లోక్‌సభ ఎన్నికలకు సమయం ఉంది. మా వ్యూహం మాకు ఉంది. దేశ రాజకీయాల్లో ఏన్నో మార్పులు వస్తాయి. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటయ్యాక లోక్‌సభ ఎన్నికలకు 3 నెలల సమయం ఉంటుంది. అప్పుడు టీఆర్ఎస్ పాత్ర ఎలా ఉంటుందనేది చూడొచ్చు. కేసీఆర్ వెంటే పేదలు.. స్వీయ అస్థిత్వం కోసం ఏర్పడ్డ తెలంగాణ.. అభివృద్ధి దిశగా సాగుతోంది. సీఎం కేసీఆర్ పరిపాలనలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. సాగునీరు, కరెంటు, సంక్షేమంలో అత్యుత్తమ విజయాలను నమోదు చేశాం. పేదలు కేసీఆర్ వెంటే ఉన్నారు. మహాకూటమి, ఇతర ప్రత్యర్థి పార్టీలకు ఇవి కన్పించట్లేదు. కేసీఆర్ శరీరంపై, భాషపై, శరీరభాషపై ఎన్నో విమర్శలు వచ్చాయి. కేసీఆర్ ఏంటో ప్రజలకు తెలుసు. డిసెంబర్ 11న ప్రజలు సరైన తీర్పు ఇస్తారు. చంద్రబాబు అవకాశవాది.. చంద్రబాబు ఒక్క వైఎస్సార్సీపీతో తప్ప అన్ని పార్టీలతో కలిశారు. అవసరం కోసం ఏ పార్టీతో అయినా కలుస్తారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ను విలన్‌గా చూపి బీజేపీతో జతకట్టారు. నాలుగేళ్లు కలిసి ఉండి ఇప్పుడు బీజేపీని విలన్‌గా చూపిస్తూ కాంగ్రెస్‌తో కలిశారు. పార్టీ ఫిరాయింపులపై చంద్రబాబు మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. టీడీపీ నుంచి గెలిచిన రేవంత్‌రెడ్డి, ఆర్.కృష్ణయ్య చంద్రబాబు కాంగ్రెస్‌లో చేరారు. ఏపీలో 24 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్నారు. చంద్రబాబు అవకాశవాది. చంద్రబాబు తెలంగాణలో కాంగ్రెస్‌ను కొన్నారు. కూటమి అధికారంలోకి వస్తే ఏపీని లోకేశ్‌కు వదిలి ఇక్కడికి వస్తారేమో. టీఆర్ఎస్ భారీ ఆధిక్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. కాంగ్రెస్‌లో 40 మంది సీఎం అభ్యర్థులు ఉన్నారు. మొదటి వరుసలో ఉండే 10 మంది ఓడిపోతున్నారు. కొడంగల్‌లోనూ టీఆర్ఎస్ గెలుస్తుంది. -
కేటీఆర్‌కు ఆరోజే చెప్పా : లగడపాటి
సాక్షి, హైదరాబాద్ : మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఇతరుల ఒత్తిడికి తలొగ్గి ఎన్నికల సర్వే ఫలితాలను మార్చారని తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. తాను ఎవరి ప్రలోభాలకు గురికాలేదని, తన టీం చేసిన సర్వేనే తాను విడుదల చేస్తున్నానని ఆయన అన్నారు. లగడపాటి బుధవారం మీడియా సమావేశంలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. తాను ఎప్పుడూ కేటీఆర్‌ను వ్యక్తిగతంగా కలవలేదని, ఈ ఏడాది నవంబర్ 11న ఆయనే తనకు మెసేజ్ పంపారని తెలిపారు. తన టీం చేస్తున్న సర్వే గురించి కేటీఆర్ తెలుసుకుని 20 నియోజకవర్గాల్లో సర్వే చేయమని ఆయన కోరినట్లు లగడపాటి వెల్లడించారు. కేటీఆర్ మాట కాదనలేక తాను 37 స్థానాల్లో సర్వే చేయించానని, వాటిలో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తున్నట్లు ఆయనతో చెప్పినట్లు లగడపాటి వెల్లడించారు. గతంలో తాను గజ్వేల్, సిద్ధిపేటలో పర్యటించినప్పుడు గజ్వేల్‌లో ఆయనకు(పేరు చెప్పడానికి లగడపాటి ఇష్టపడలేదు) కష్టంగా ఉందని అక్కడి పోలీసులే తనతో చెప్పినట్లు పేర్కొన్నారు. మంగళవారం ముగ్గురు స్వతంత్ర అభ్యర్థుల పేర్లను లగడపాటి వెల్లడించిన తరువాత ఆయనపై కేటీఆర్ ఫైర్ అయిన విషయం తెలిసిందే. కేటీఆర్ వ్యాఖ్యలపై లగడపాటి వివరణ ఇస్తూ.. ‘‘నవంబర్ 16న మా బంధువుల ఇంట్లో ఆయనతో తొలిసారి భేటీ అయ్యాను. 37 స్థానాల ఫలితాలపై ఆయన విభేదించారు. అప్పటి నుంచి ఆయనతో నేను మాట్లాడలేదు. కూటమి ఏర్పడక ముందు మా టీం చేసిన సర్వేలో టీఆర్ఎస్కే అనుకూలంగా ఉంది. కానీ టీజేఎస్, సీపీఐ, టీడీపీ, కాంగ్రెస్ కూటమిగా ఏర్పడ్డ తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయిది. సిట్టింగ్ స్థానాల్లో కొంతమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని కూడా కేటీఆర్‌తో చెప్పాను. అభ్యర్థులను మార్చమని కూడా సలహా ఇచ్చాను. టీడీపీతో పొత్తుపెట్టుకోమని కేటీఆర్‌కు సలహా ఇచ్చాను. కానీ ఆయన మాకు అవసరం లేదన్నారు’’ ‘‘రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి వంటివారిని అరెస్ట్ చేయించడం వల్ల మీకే నష్టం జరుగుతుందని కూడా కేటీఆర్‌కు చెప్పాను. పోటాపోటీ ఉన్నప్పుడు మాత్రమే ప్రభుత్వం వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. టీఆర్ఎస్ ఇచ్చిన పలు వాగ్ధానాలు డబుల్ బెడ్రూం, దళితులకు మూడెకరాల భూమి కేసీఆర్‌కు ప్రతికూలంగా మారాయి. తాజాగా మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది’’ అని తెలిపారు. సంబంధిత వార్తలు ప్రజాఫ్రంట్ వైపే ప్రజానాడి.. బాబు ఒత్తిడితోనే ‘సర్వే’ మార్చారు -
ప్రజాఫ్రంట్ వైపే ప్రజానాడి..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత వాతావరణం, ప్రజానాడి హస్తానికే మొగ్గు ఉందని కాంగ్రెస్ పార్టీ మాజీ నేత లగడపాటి రాజగోపాల్ పేర్కొన్నారు. అక్టోబర్ 20 నుంచి దాదాపు 45 రోజులపాటు తమ ఫ్లాష్ టీం చేసిన సర్వేలో ఫలి తాలు ఆసక్తికరంగా రాబోతున్నాయని వెల్లడించారు. ఆయన మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో 8 నుంచి 10 మంది ఇండిపెండెంట్లు గెలవబోతున్నారని ఇటీవల ఆయన తిరుపతిలో చెప్పిన విషయం తెలిసిందే. అప్పుడు ఇద్దరు పేర్లు వెల్లడించిన లగడపాటి.. తాజాగా మరో ముగ్గురి పేర్లను బయటపెట్టారు. ఇబ్రహీంపట్నం నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, బెల్లంపల్లి నుంచి జి.వినోద్, మక్తల్ నుంచి జలంధర్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థులుగా గెలవబోతున్నారని చెప్పారు. పోలింగ్ శాతం తగ్గితే హంగ్... అసెంబ్లీ ఎన్నికల్లో నమోదయ్యే ఓటింగ్ శాతాన్ని బట్టి విజయం ఎవరిదన్న అంశంపై స్పష్టత వస్తుందని లగడపాటి తెలిపారు. 2014 ఎన్నికల్లో 68.5శాతం ఓటింగ్ జరిగిందని, ఇంతకంటే ఎక్కువగా పోలింగ్ జరిగితే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నట్టు స్పష్టమవుతుందని, ఒకవేళ పోలింగ్ శాతం ఇంతకన్నా తగ్గితే హంగ్ ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉందని వివరించారు. ఖమ్మం, నల్లగొండ, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాలు కూటమికి అనుకూలంగా ఉండగా.. వరంగల్, నిజామాబాద్, మెదక్ జిల్లాలు టీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నాయని వివరించారు. మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల్లో కూటమి–టీఆర్ఎస్ల మధ్య గట్టి పోటీ ఉందన్నారు. హైదరాబాద్‌లో ఉన్న 14 సీట్లలో మెజారిటీ సీట్లు ఎంఐఎం కైవసం చేసుకుంటుందని తెలిపారు. ఈసారి బీజేపీకి గత ఎన్నికల కంటే ఎక్కువ స్థానాలు వస్తాయని వెల్లడించారు. ఈ సర్వేల విషయంలో తాను ఏపీ సీఎం చంద్రబాబును గానీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌ను గానీ కలవలేదని లగడపాటి స్పష్టంచేశారు. రాష్ట్రంలోని 100 నియోజకవర్గాల్లో వెయ్యి మంది నుంచి 1,200 మంది శాంపిల్స్ తీసుకున్నామని చెప్పారు. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతోపాటు తెలంగాణ ఎన్నికల సర్వే పూర్తి ఫలితాలను 7వ తేదీ సాయంత్రం వెల్లడిస్తానని తెలిపారు. కాగా, తన సన్నిహితులైన ముగ్గురు నేతలు ఇండిపెండెంట్లు ఆధిక్యంలో ఉన్నచోట బరిలో ఉన్నందున ఆ వివరాలు ఇప్పుడే వెల్లడించలేనని లగడపాటి చెప్పడం గమనార్హం. -
‘లగడపాటికి.. ఆ భూమికి ఉన్న సంబంధం ఏంటి?’
సాక్షి, హైదరాబాద్ : పారిశ్రామిక వేత్త జీపీ రెడ్డి ఇంట్లో పోలీసులు అర్ధరాత్రి సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాడి రాజగోపాల్ పోలీసుల తీరుపై మండిపడ్డారు. కేవలం ఐజీ నాగిరెడ్డి ఒత్తిడి మేరకే పోలీసులు ఈ చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. లగడపాటి ఆరోపణలపై ఐజీ నాగి రెడ్డి స్పందించారు. జీపీ రెడ్డిపై చర్యలు తీసుకుంటే లగడపాటి ఎందుకు అడ్డు తగులుతున్నాడని ప్రశ్నించారు. లగడపాటికి.. ఈ భూమికి ఉన్న సంబంధం ఏంటో బయటపెట్టాలని ఐజీ నాగి రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ.. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో ఉన్న భూమికి తనకు ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఆ భూమిని తన అత్తగారి తల్లి కొనుగోలు చేశారని తెలిపారు. ఈ భూమి వ్యవహారంలో తాను ఇంత వరకూ తల దూర్చలేదని స్పష్టం చేశారు. రెండేళ్లగా ఎలాంటి చర్యలు తీసుకుంటారా అని ఎదురు చూస్తున్నానన్నారు. జీపీ రెడ్డి గతంలో ఫోర్జరి డ్యాకుమెంట్లు సృష్టించి ఈ భూమి అమ్మే ప్రయత్నం చేశాడని వెల్లడించారు. విమెక్ కో ఆపరేటివ్ సోసైటీలోని మా కుంటుంబ సభ్యుల.. బాధిత సోసైటీ సభ్యుల ఫిర్యాదు మేరకే బంజారాహిల్స్ పోలీసులు జీపీ రెడ్డి ఇంటకి వెళ్లారని తెలిపారు. ఈ వివాదంలో లగడపాటి పదేపదే తన పేరు ప్రస్తావించడం సరికాదంటూ నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అవకాశం ఇస్తే తెలంగాణలో పోటీ చేస్తా : లగడపాటి
సాక్షి, న్యూఢిల్లీ : తనకు అవకాశం ఇస్తే తెలంగాణలో పోటీచేయడానికి సిద్దంగా ఉన్నానని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యానించారు. ఆంధ్రాలో భావోద్వేగాలతో కూడిన రాజకీయాలకు తాను దూరంగా ఉంటానని.. మెదక్ జిల్లా ప్రజలు తనను తెలంగాణలో పోటీ చేయాలని కోరుతున్నారని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఎంపీగా పోటీచేయడానికి తనకేమీ అభ్యంతరం లేదని పేర్కొన్నారు. తాను కేవలం ఆంధ్రా రాజకీయల నుంచి మాత్రమే తప్పుకున్నానని.. తెలంగాణలో ప్రజలు కోరుకుంటే తప్పకుండా పోటీ చెస్తానని అన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందితే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానన్న లగడపాటి.. తెలంగాణలో పోటీ చేస్తానని పేర్కొనడం గమనార్హం. ఎన్నికలు పూర్తయిన తరువాత ప్రతిసారి సర్వే ఫలితాలతో లగడపాటి వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఈసారి కూడా తెలంగాణ ఎన్నికలు పూర్తి అవ్వగానే సర్వే ఫలితాలను ప్రకటిస్తానని అన్నారు. తన పేరుతో సోషల్ మీడియాలో, వాట్సప్, యూట్యూబ్‌లో వచ్చే సర్వేలు తనవికావని, వాటిని నమ్మవద్దని చెప్పారు. 2014 నుంచి రాజకీయలకు దూరంగా ఉన్నానని.. ప్రజల భావోద్వేగాలతో ఎదగడానికి ప్రయత్నిస్తున్నానని అందరూ అనుకోబట్టే రాజకీయాలకు దూరంగా ఉన్నానని తెలిపారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో లగడపాటి కాంగ్రెస్ తరుఫున విజయవాడ ఎంపీగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఏపీ పునర్విభజన బిల్లును వ్యతిరేకిస్తూ.. లోక్‌సభలో సభ్యులతో పెప్పర్స్ర్పే దాడితో సంచలనం సృష్టించారు. ఆ తరువాత ఎంపీ పదవికి రాజీనామా చేసిన లగడపాటి.. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడిని ఖండిస్తున్నట్లు రాజగోపాల్ తెలిపారు. రాజకీయాల్లో అనేక దారులున్నప్పుడు బౌతికపరమైన దాడులు సరైన విధానం కాదని అన్నారు. -
ట్విటర్ లో వర్మ కితకితలు!
సంచలన దర్శకుడిగా సినీ పరిశ్రమలో పేరు సంపాదించుకున్న రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన, వ్యంగ్యం, వివాదస్పద వ్యాఖ్యలతో సెన్సేషనల్ గా మారారు. సోషల్ మీడియాలో రాంగోపాల్ వర్మ గమ్మత్తైన సెటైర్లతోనే కాకుండా, వ్యక్తులపై వ్యంగ్యస్థాలను విసరడంలో వర్మ డిఫెరెంట్ స్టైల్ ను ఫాలోఅవుతుంటారు. ఇటీవల కాలంలో దయ్యాల కథలతో తెరపై హారర్ సృష్టిస్తున్న వర్మ సోషల్ మీడియాలో హాస్యాన్ని పంచుతూ తనలో మరో కోణం ఉందనిపించుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ , లగడపాటి రాజగోపాల్, లోకసభ స్పీకర్ మీరా కుమార్ పై చేసిన చాలా ఆసక్తిని రేకెత్తించాయి. "@sirasri: For the 1st time I am eagerly waiting for hot summer; just to see Mr.Arvind Kejriwal without Muffler."— Ram Gopal Varma (@RGVzoomin) February 6, 2014 ఎప్పుడూ తలచుట్టూ మఫ్లర్ కట్టుకుని కనిపించే కేజ్రివాల్ పై గమ్మత్తైన ట్వీట్ చేశారు వర్మ. 'రానున్న వేసవి కాలం కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే తలకు మఫ్లర్ లేని కేజ్రివాల్ ను చూడాలని ఉంది' అని ట్వీట్ చేశారు. అంతేకాక ఇక కేజ్రివాల్ కాదు.. కేజ్రిఫాల్ అంటూ సెటైర్ వేశారు. పెప్పర్ స్ప్రే ఘటన తర్వాత లగడపాటిని టార్గెట్ చేశారు. భగత్ సింగ్ తర్వాత పార్లమెంట్ ను కుదిపేసిన రెండవ వ్యక్తి లగడపాటి. పార్లమెంట్ లో ఏం జరిగిందో పక్కన పెడితే.. ప్పెప్పర్ స్పే ను ఆత్మరక్షణ ఆయుధంగా ఉపయోగించుకోవచ్చని లగడపాటి పబ్లిసిటీ ఇచ్చారు. భవిష్యత్ ఉద్యమకారులకు పెప్పర్ స్పే ఓ మంచి ఆయుధంగా మారే అవకాశం ఉంది. త్వరలోనే క్లాస్ రూమ్, సినిమా హాళ్లలో, షాపింగ్ మాల్స్ లో పెప్పర్ స్పే వినియోగించడం త్వరలోనే చూస్తాం అని ట్వీట్ చేశారు. One thing the pepper spray has achieved is that for the first time evr I saw Meira kumar without a smile— Ram Gopal Varma (@RGVzoomin) February 15, 2014 అంతేకాక కాకుండా మిర్చి పౌడర్ కంటే పెప్పర్ స్పే ఘాటుగా ఉంటుందా అనే కుతుహలం మొదలైందన్నారు వర్మ. ఇంకా ఓ అడుగు ముందేసి .. ఎప్పుడూ చిరునవ్వుతో దర్శనమిచ్చే స్పీకర్ మీరా కుమార్ ..పెప్పర్ స్పే ఘటన తర్వాత ఆమె ముఖంలో నవ్వు మాయమైంది అని ట్విటిచ్చారు. "@sirasri: BREAKING News announced BREAKING Andhra Pradesh"— Ram Gopal Varma (@RGVzoomin) February 18, 2014 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు లోకసభ ఆమోదం లభించిన తర్వాత.. బ్రేకింగ్ న్యూస్ అనౌన్స్ డ్... బ్రేకింగ్ ఆంధ్రప్రదేశ్ అంటూ వర్మ ట్విట్ చేశారు. దేశంలో జరుగుతున్న అనేక సంఘటనలపై స్పందిస్తూ.. సెటైర్లతో నెటిజన్లకు ఆనందాన్ని పంచుతున్న రాంగోపాల్ ట్విటర్ అకౌంట్ లో 8 లక్షల 17 వేల మంది వర్మను ఫాలో అవుతున్నారు.