ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రీపోల్, ఎగ్జిట్ పోల్ సర్వేల ఫలితాలను మించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీ దిశగా దూసుకెళ్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 149 పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. టీడీపీ కేవలం 23 సీట్లలో మాత్రమే ఆధిక్యంలో ఉంది. జనసేన ఒక స్థానానికే పరిమితమయ్యేలా కనిపిస్తోంది. లోక్‌సభ ఫలితాల్లో 25కి 24 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ ఆధిక్యంలో ఉంది.