షాకింగ్ ఘటన... పోలీసుల మైండ్ బ్లాంక్! | Girl Stabbed 71 Year-Old and Sprayed Pepper In Her Eyes, Say Police | Sakshi
Sakshi News home page

షాకింగ్ ఘటన... పోలీసుల మైండ్ బ్లాంక్!

Published Thu, May 12 2016 11:20 AM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM

షాకింగ్ ఘటన... పోలీసుల మైండ్ బ్లాంక్! - Sakshi

షాకింగ్ ఘటన... పోలీసుల మైండ్ బ్లాంక్!

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ చిన్నారి కిరాతకానికి ఒడిగట్టింది. లూటీ చేయడంలో భాగంగా ఓ వృద్ధురాలిని బాలిక చితకబాదిన ఘటన న్యూఢిల్లీలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు ఈ ఘటనపై ముక్కుమీద వేలేసుకుంటున్నారట. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఓ బాలిక(11) నిన్న సాయంత్రం తల్లి పనిచేసే చోటుకు బయలుదేరింది. రాజౌరి గార్డెన్ ప్రాంతానికి రాగానే ఏం జరిగిందో తెలీదు కానీ, ఆ దారిలో వెళ్తోన్న 71 ఏళ్ల వృద్ధురాలు మదాన్ పై దాడికి పాల్పడింది. మొదటగా బ్లాక్ పెప్పర్ స్ప్రేని పెద్దావిడ కళ్లల్లో కొట్టింది. ఆ వెంటనే పూలకుండీతో ఆమెపై దాడికి దిగి ఆమెను చితకబాదింది. దీంతో దెబ్బలకు తట్టుకోలేక ఆ వృద్ధురాలు గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టింది.

మదాన్ అరుపులు విన్న కొందరు వెంటనే అక్కడికి వచ్చి ఆమెను కాపాడి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకోగానే ఆ బాలికను స్థానికులు వారికి అప్పగించారు. వారు ఆ బాలికను చిన్నారుల కేర్ హౌస్ కు తరలించారు. బాలిక ఎందుకు ఈ దారుణానికి పాల్పడిందో స్పష్టతరాలేదని చెప్పారు. వృద్ధురాలి వద్ద ఉన్న విలువైన వస్తువులు చోరీ చేయడానికి ఉద్దేశపూర్వకంగానే బాలిక ఈ పని చేసి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. పెప్పర్ స్ప్రేతో సంచరించాల్సిన అవసరం ఏంటన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వృద్ధురాలిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement