గోరంత ఆయుధం | talk of the event: Haktan pepper spray | Sakshi
Sakshi News home page

గోరంత ఆయుధం

Published Tue, Oct 7 2014 1:08 AM | Last Updated on Sat, Sep 2 2017 2:26 PM

గోరంత ఆయుధం

గోరంత ఆయుధం

మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను గోటితో అరికట్ట వచ్చు. హాకథాన్‌లో డిజైన్ అయిన ఈ గోరంత ఆయుధం వ నితలకు కొండంత ధైర్యాన్నిస్తుంది. సోమవారం హైటెక్స్‌లో ప్రారంభమైన మెట్రోపొలిస్‌లో ఈ బుల్లి బాడీగార్డ్ టాక్ ఆఫ్ ద ఈవెంట్‌గా మారింది. ‘మెట్రొపొలిస్’ ప్రదర్శనలో బెస్ట్ ఫైవ్ హాకథాన్ థాట్స్‌లో ఒకటిగా నిలిచింది. చూడటానికి రిస్ట్ వాచ్‌లా కనిపించే ఈ సేఫ్టీ డివైస్ ఆపదలో ఉన్న మహిళను అన్నిరకాలుగా ఆదుకుంటుంది. ఒకటిన్నర అంగుళం పొడవులో ఉండే ఈ డివైజ్‌లో పెప్పర్ స్ప్రే ఉంటుంది. బటన్ నొక్కితే చాలు కామాంధుల కళ్లు మండిపోతాయి.
 
 ఎప్పుడైతే పెప్పర్ స్ప్రే బటన్ ప్రెస్ చేస్తామో.. వెంటనే అలారమ్ మోగుతుంది. బాధితురాలున్న ప్రదేశం వివరాలు సర్వర్‌కు చేరుకుంటాయి. ఆ వివరాలన్నీ అక్కడి నుంచి నేరుగా బాధితురాలికి దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్‌కు చేరిపోతాయి. తక్కువ ధరలో లభించే ఈ డివైజ్ వాటర్‌ప్రూఫ్ కూడా కావడం విశేషం. ఒకసారి చార్జింగ్ పెడితే 36 గంటలు పనిచేస్తుంది. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన కుర్రాడు సిద్ధార్థ్ దాస్, గ్రాడ్యుయేట్ బీరేంద్రశేఖర్‌తో కలసి ఈ డివైజ్‌ను రూపొందించాడు. ఒడిశాకు చెందిన సిద్ధార్థ్ ఎస్‌ఆర్‌నగర్‌లోని శ్రీచైతన్య కాలేజ్‌లో గతేడాది ఇంటర్ పూర్తి చేశాడు. సరికొత్త ఎలక్ట్రానిక్ పరికరాల తయూరీపై ఆసక్తి ఉన్న సిద్ధార్థ్.. యువతుల రక్షణ కోసం దీనిని రూపొందించానని చెబుతున్నాడు.
 - సరస్వతి రమ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement