వాషింగ్టన్: 9/11 దాడుల నిందితులకు అమెరికా ఝలక్ ఇచ్చింది. వాళ్లు దరఖాస్తు చేసుకున్న నేరాంగీకార అభ్యర్థనను తిరస్కరించింది. మరణ శిక్ష నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతోనే వాళ్లు ఇందుకు సిద్ధపడినట్లు అంచనాకి వచ్చిన రక్షణ శాఖ కార్యాలయం.. ఈ మేరకు వాళ్ల పిటిషన్‌ను తోసిపుచ్చింది.
సెప్టెంబర్ 11, 2001 దాడులకు సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఖలీద్ షేక్ మహ్మద్, అతని ఇద్దరు సహచరులు దాడి తామే చేసినట్టు ఇటీవల నేరాన్ని అంగీకరించారు. సుదీర్ఘకాలంగా వాళ్లు తమ మరణశిక్ష ముప్పును తప్పించాలని కోరుతున్నట్లు సమాచారం. అయితే.. తాజాగా దానికి సమ్మతిస్తేనే నేరాంగీకారానికి ముందుకు వస్తామని వారు షరతు విధించినట్లు తెలుస్తోంది.
ఈ నిందితులకు సంబంధించి అమెరికా రక్షణ కార్యదర్శి, గ్వాంటనామో వార్ కోర్టు ఇంచార్జ్ సుసాన్ ఎస్కాలియర్ ఒక మెమోరాండం విడుదల చేశారు. నిందితులతో విచారణకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకునే బాధ్యత నాపైనే ఉంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. జూలై 31, 2024న సంతకం చేసిన మూడు ముందస్తు విచారణ ఒప్పందాలను తిరస్కరిస్తున్నానని తెలిపారు.
ప్రస్తుతం నిందితులు క్యూబాలోని గ్వాంటనామో బేలోని జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఇక.. 9/11 దాడుల్లో మొత్తం 2,996 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25 వేల మంది సాధారణ పౌరులు క్షతగాత్రులయ్యారు. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఉగ్రదాడిగా దీనిని పేర్కొంటారు.
Comments
Please login to add a commentAdd a comment