సాక్షి, తిరుపతి: తిరుపతి జిల్లాలో టీడీపీ నేతల అరాచకాలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. తాజాగా జిల్లాలో పచ్చ బ్యాచ్ మరోసారి రెచ్చిపోయింది. భాకరాపేటలో వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై దాడి చేసి ఆఫీసులో ఉన్న ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. అనంతరం, కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడ్డారు.
వివరాల ప్రకారం... తిరుపతి జిల్లాలోని భాకరాపేటలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. మంగళవారం అర్ధరాత్రి పార్టీ ఆఫీసుపై దాడి చేశారు. ఈ సందర్బంగా ఆఫీసులో ఉన్న ఫర్నీచర్, ఇతర సామాన్లు ధ్వంసం చేసి బీభత్సం సృష్టించింది. దీంతో, ఈ ఘటనపై వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దాడికి పాల్పడిన టీడీపీ కార్యకర్త తులసిరెడ్డిని అరెస్ట్ చేశారు.
ఇక, పోలీసులు అరెస్ట్ చేయడంతో మరింత ఆగ్రహానికి లోనైన తులసిరెడ్డి కానిస్టేబుల్‌పైనే దాడి చేశాడు. అధికారం మాది నన్నే అరెస్ట్ చేస్తారా? అంటూ రెచ్చిపోయి విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడ్డాడు. ఈ సందర్భంగా కానిస్టేబుల్‌కి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో, అతడిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా పోలీసు స్టేషన్ అద్దాలను కూడా ధ్వంసం చేశారు.
అనంతపురం జిల్లాలోని బుక్కరాయ సముద్రం మండలం పొడరాళ్లలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. వైఎస్సార్‌సీపీ నేత శ్రీనివాస్ రెడ్డి ఇంటి స్థలం కబ్జా చేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు. దీంతో, వారిని అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై పచ్చ నేతలు దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే రాళ్లు, కర్రలతో దాడికి దిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు.
ఇది కూడా చదవండి: ‘మా కలలు చిదిమేసిన చంద్రబాబు ప్రభుత్వం’
Comments
Please login to add a commentAdd a comment