మహిళలపై టీడీపీ నేతల మరో అరాచకం | Tdp attacks on womens | Sakshi
Sakshi News home page

మహిళలపై టీడీపీ నేతల మరో అరాచకం

Published Tue, Nov 5 2024 5:48 AM | Last Updated on Tue, Nov 5 2024 5:48 AM

Tdp attacks on womens

అర్ధరాత్రి ఓ ఇంట్లోకి చొరబడి మహిళలపై చెప్పులతో దాడి 

సాక్షి టాస్‌్కఫోర్స్‌: ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రాతి­­నిధ్యం వహిస్తున్న అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీ అరాచకాలు మరీ శ్రుతిమించాయి. ఆదివారం అర్ధరాత్రి ఆత్మకూరు మండలం బ్రాహ్మణ యాలే­రులో టీడీపీ నేతలు అరాచకం సృష్టించారు. బాధితుల కథనం మేరకు.. బ్రాహ్మణ యాలే­రుకు చెందిన రహమత్‌బీ అన్న ఇస్మాయిల్‌ వైఎస్సార్‌సీపీ తరఫున చురుగ్గా పనిచేసేవాడు. అతడిపై కొందరు టీడీపీ నాయకులు అక్కసు పెంచుకున్నారు.  

కూటమి ప్రభుత్వం వచ్చాక ఇస్మాయిల్‌ గ్రామం వదలి వేరేచోట తలదాచుకున్నాడు. పది రోజుల క్రితం  గ్రామానికి తిరిగొచ్చాడు. దీన్ని జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు గ్రామానికి చెందిన యువతిపై ఇస్మాయిల్‌ దాడి చేశాడంటూ అనంతపురం పోలీ­స్‌ స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా అర్ధరాత్రి వేళ టీడీపీకి చెందిన దాసరి అనిల్, దాసరి ఈశ్వరయ్య, మిలటరీ ఈశ్వ­రయ్య, దాసరి నీరజ ద్విచక్ర వాహనాలపై వచ్చి రహమత్‌బీ ఇంట్లోకి చొరబడ్డారు.

బూతులు తిడు­తూ ఆమెతో పాటు కులసింబీ, అమనాబీలపై చెప్పులతో దాడి చేశారు. మెడలో ఉన్న నల్లపూసల దండలు తెంచేశారు. ఊరు వదిలి వెళ్లిపోవాలని, లేకుంటే అంతు చూస్తామని బెదిరించారు. ఈ ఘటనపై సోమవారం ఉదయం ఫిర్యా­దు చేయడానికి పోలీస్‌ స్టేషన్‌కు వెళుతుండగా మాపైనే ఫిర్యా­దు చేస్తారా అంటూ మరోసారి దాడి చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement