ఇజ్రాయెల్ సైన్యం గాజాలోని బీట్ లాహియాలో ఉన్న ఓ ఐదు అంతస్తుల నివాస భవనంపై దాడి చేసింది. ఈ దాడిలో సుమారు 77 మంది పాలస్తీనియన్లు మరణించగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిలో శిథిలాల కింద చిక్కుకొని చాలా మంది గాయపడ్డారని పాలస్తీనియన్ సివిల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ తెలిపింది. మృతి చెందిన వారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులేనని ఉన్నారని గాజా అధికారులు పేర్కొన్నారు. అయితే.. ఈ దాడిపై ఇంతవరకు ఇజ్రాయెల్ స్పందించకపోవటం గమనార్హం.
BREAKING: The death toll has risen to 77, including 25 children, following the horrific Israeli massacre in Beit Lahiya, northern Gaza, according to local sources. The majority of the victims are from the Abu Nassr clan. pic.twitter.com/j660WyvzYK
— 🇵🇸 Palestine Watermelons 🍉 (@PalestineMelons) October 29, 2024
శిథిలాల నుంచి మరింత మందిని బయటకు తీస్తున్నారు. గాయపడినవారి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు.. పాలస్తీనా శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ (UNRWA)పై ఇజ్రాయెల్ నిషేధం విధించటంపై ప్రపంచ దేశాధినేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇజ్రాయెల్ చర్య.. సహించరానిది, చట్టవిరుద్ధమైదిగా పేర్కొంటున్నారు. ఈ దాడిలో మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
చదవండి: యుద్ధాన్ని ఆపే సత్తా మోదీకి ఉంది
Comments
Please login to add a commentAdd a comment