వాషింగ్టన్: అమెరికాలో 9/11 దాడులకు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సెప్టెంబర్ 11, 2001 దాడులకు సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఖలీద్ షేక్ మహ్మద్, అతని ఇద్దరు సహచరులు దాడి తామే చేసినట్టు నేరాన్ని అంగీకరించారు. ఈ మేరకు క్యూబాలోని గ్వాంటనామో బేలోని యూఎస్ జైలు అధికారులు వెల్లడించారు.
కాగా, వారు నేరాన్ని అంగీకరించింది మరణ శిక్ష నుంచి తప్పించుకునేందుకేనని పలువురు అధికారులు చెబుతున్నారు. నేరం అంగీకరరించిన నేపథ్యంలో జీవిత ఖైదు కోసం ఒక అభ్యర్థించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, వారికి జీవితఖైదు పడే అవకాశం ఉన్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న కీలక అధికారి ఒకరు వెల్లడించారు. అయితే, 9/11 దాడుల నిందితులు ప్రస్తుతం క్యూబాలోని జైలు ఉంటున్నారు. ఇక, 9/11 దాడుల్లో మొత్తం 2,996 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25 వేల మంది సాధారణ పౌరులు క్షతగాత్రులయ్యారు. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఉగ్రచర్యగా పేర్కొనే ఈ దాడులు ప్రపంచాన్నే విస్మయానికి గురిచేశాయి.
ఇదిలా ఉండగా.. అగ్రరాజ్యం అమెరికాలోని మ్యాన్‌హాటన్‌లో ‘ట్విన్ టవర్స్’గా పిలుచుకునే వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ను ఉగ్రవాదులు క్షణాల్లో కూల్చివేశారు. అమెరికాకు కీలకమైన నాలుగు భవనాలను కూల్చివేయడం ద్వారా కోలుకోలేని దెబ్బకొట్టాలని అల్‌ఖైదా ఉగ్రవాదులు భావించారు. పాకిస్థానీ మిలిటెంట్ ఖలీల్ అహ్మద్ షేక్ వ్యూహ రచనలో అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ నేతృత్వంలో అమెరికాలో నాలుగు చోట్ల విమానాలతో దాడి చేసేందుకు ప్రణాళికలు రచించారు. సెప్టెంబరు 11, 2001న నాలుగు విమానాలను పథకం ప్రకారం హైజాక్ చేశారు. 19 మంది ఉగ్రవాదులు నాలుగు జట్లుగా విడిపోయి భవనాలపై దాడులకు పాల్పడ్డారు.
4. Chilling footage reveals the exact moment Flight 175 struck the South Tower of the World Trade Center.#NeverForget #911Anniversary pic.twitter.com/ndd0Txeylq
— Chidanand Tripathi (@thetripathi58) July 28, 2024
ఈ ప్రదేశంలోనే విమానంలోని ఉగ్రవాదులు, ప్రయాణికులు కూలిన భవనాల కింద చిక్కుకొని మృతిచెందారు. మొత్తం 2,763 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మూడో విమానం పెంటగాన్‌లో అమెరికా రక్షణ కార్యాలయంలోని ఓ భవంతిని ఢీకొట్టగా.. వైట్‌హౌజ్ లక్ష్యంగా సాగిన నాలుగో విమానం సోమర్‌సెట్ కౌంటీలోని ఓ మైదానంలో కుప్పకూలింది. గంటల వ్యవధిలోనే జరిగిన ఈ మారణహోమంలో మొత్తం 2,996 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25 వేల మంది సాధారణ పౌరులు క్షతగాత్రులయ్యారు.
అమెరికా ప్రతీకార దాడులు..
2001, అక్టోబర్ 7న అమెరికా నాటో దళాల సహాయంతో ఉగ్రవాదులు తలదాచుకున్న అఫ్గాన్ సరిహద్దులపై ప్రతీకార దాడులు మొదలుపెట్టింది. తాలిబన్లను గద్దెదించిన అమెరికా ప్రజాస్వామ్య పాలనకు నాంది పలికి హమిద్ కర్జాయ్‌ను దేశాధ్యక్షుడిగా నియమించింది. దేశ పాలన, రక్షణను తన చేతుల్లోకి తీసుకుంది. 20 ఏళ్ల పాటు ఉగ్రవాదుల ఏరివేతకు సైనిక కార్యకలాపాలను కొనసాగిస్తూనే పునఃనిర్మాణ బాధ్యతలు చేపట్టింది. ఇదే సమయంలో పాక్‌లో అబోటాబాద్‌లో తలదాచుకున్న లాడెన్‌ను 2011, మే 2న అర్ధరాత్రి అమెరికా సేనలు హతమార్చాయి. అయితే, పాక్‌లోనే ఆశ్రయం పొందుతున్న ఇతర అల్‌ఖైదా నేతలనుగానీ, తాలిబన్లనుగానీ అంతమొందించలేకపోయింది.
Comments
Please login to add a commentAdd a comment